Deputy Sarpanch Attack | ఉప సర్పంచ్‌పై దాడి ఘటనతో సుద్దులంలో ఉద్రిక్తత

పంచాయతీ నిధుల బిల్లుల వివాదం డిచ్​పల్లి మండలం సుద్దులం గ్రామంలో తీవ్ర కలకలం రేపింది.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్‌పల్లి: Deputy Sarpanch Attack | పంచాయతీ నిధుల బిల్లుల వివాదం డిచ్​పల్లి (Dichpally) మండలం సుద్దులం (Suddulam) గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. బిల్లులపై సంతకం చేయనందుకు సర్పంచ్, ఆమె భర్త తనపై దాడిచేసి, అసభ్యకరంగా దూషించారంటూ దళిత సామాజికవర్గానికి చెందిన ఉప సర్పంచ్ చెవిటి నరేష్  ఏసీపీ ప్రకాష్ యాదవ్​కు ఫిర్యాదు చేశారు.

Deputy Sarpanch Attack | సంచలనం సృష్టించిన  ‘అక్షరటుడే’ కథనం

మహిళా సర్పంచ్, ఆమె భర్త కలిసి దళిత ఉపసర్పంచ్‌పై దాడి చేశారనే కథనం ‘అక్షరటుడే'(Akshara Today) పత్రికలో రావడంతో జిల్లావ్యాప్తంగా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఘటన సమాచారం తెలుసుకున్న దళిత సంఘాలు, ఎమ్మార్పీఎస్​ (MRPS), ధర్మ సమాజ్ పార్టీ నాయకులు సుద్దులం గ్రామానికి వచ్చి ఉప సర్పంచ్ నరేష్​ను పరామర్శించి ధైర్యం చెప్పారు. దాడికి సంబంధించి వివరాలు తెలుసున్నారు. దళిత ఉప సర్పంచ్​పై దాడిని ఖండిస్తూ గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. దాడికి పాల్పడిన సర్పంచ్ హేమలత, ఆమె భర్త లక్ష్మణ్ రెడ్డిపై ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

Deputy Sarpanch Attack | రంగంలోకి దిగిన పోలీసులు..

దళిత ఉప సర్పంచ్‌పై దాడి జరిగిన ఉదంతంపై ఉన్నతాధికారుల ఆదేశాలతో డిచ్​పల్లి ఎస్సై ఆరిఫ్ శుక్రవారం సుద్దులం గ్రామాన్ని సందర్శించారు. పంచాయతీ కార్యాలయంలో అసలు ఏం జరిగిందనే కోణంలో సమగ్ర విచారణ చేపట్టారు. ప్రత్యక్ష సాక్షులు, స్థానికుల నుంచి వివరాలు సేకరించి, వారి వాంగ్మూలాలను రికార్డు చేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతామని ఎస్సై పేర్కొన్నారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *