Fee Reimbursement Arvind | విద్యార్థుల ఉసురు పోసుకుంటున్న రేవంత్​రెడ్డికి పుట్టగతులుండవ్​.. : ఎంపీ అర్వింద్​

రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని గద్దె దించే కార్యక్రమం ఇందూరు నుంచే ప్రారంభమైందని.. విద్యార్థుల ఉసురు పోసుకుంటున్న రేవంత్​రెడ్డికి పుట్టగతులుండవని ఎంపీ అర్వింద్​ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Fee Reimbursement Arvind | రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని గద్దె దించే కార్యక్రమం ఇందూరు నుంచే ప్రారంభమైందని.. విద్యార్థుల ఉసురు పోసుకుంటున్న రేవంత్​రెడ్డికి పుట్టగతులుండవని ఎంపీ అర్వింద్​ వ్యాఖ్యానించారు. నగరంలోని పాత కలెక్టరేట్​ వద్ద ధర్నా చౌక్​లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇందూర్ రణభేరి’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు.

Fee Reimbursement Arvind | ఇందూరు గడ్డపైనే ఆలోచన పుట్టింది..

ఇందూరు గడ్డపైనే ఫీజ్​ రీయింబర్స్​మెంట్​ ఆలోచన పుట్టిందని ఎంపీ అర్వింద్​ (MP Arvind) అన్నారు. 2004లో పీసీసీ చీఫ్​ డీఎస్​ అప్పటి కాంగ్రెస్​ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చారన్నారు. అప్పటి సీఎం రాజశేఖర్​రెడ్డి ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చాక అనేక మంది పేద విద్యార్థులు లబ్ధి పొందారన్నారు. ఈ పథకం పేద విద్యార్థులకు వరంగా మారిందన్నారు. అయితే కాంగ్రెస్​ ప్రభుత్వం రీయింబర్స్​మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Fee Reimbursement Arvind | కేసీఆర్​ డేంజరస్​ అయితే.. రేవంత్​రెడ్డి డిజాస్టర్

Fee Reimbursement Arvind

కేసీఆర్​ డేంజరస్​ అయితే.. రేవంత్​రెడ్డి డిజాస్టర్​ అని ఎంపీ అర్వింద్​ వ్యాఖ్యానించారు. యువ వికాసం పేరుతో ఫీజ్​ రీయింబర్స్​మెంట్​ బకాయిలు వెంటనే చెల్లిస్తామని కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు మేనిఫెస్టోలో చేర్చిందన్నారు. రూ.12వేల కోట్ల బకాయిలు తీరుస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హామీని తుంగలో తొక్కిందన్నారు. రూ.12వేల కోట్లు బకాయిలు ఉంటే.. కంటితుడువుగా రూ.200 కోట్లు విడుదల చేశారని.. అవి ఏ మూలకు సరిపోతాయే రేవంత్​రెడ్డి చెప్పాలని ఎంపీ అన్నారు. రాయదుర్గంలో, ఉస్మాన్​సాగర్​ తదితర ప్రాంతాల్లో భూములు అమ్మితే రూ.వేల కోట్లు వచ్చాయని.. వాటిని ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.

Fee Reimbursement Arvind | ​ రీయింబర్స్​మెంట్​ ఇవ్వాలంటే కమీషన్లు కావాలట..

Fee Reimbursement Arvind

ఏపీలో చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్​ బాగా చేస్తున్నారని.. సీఎం రేవంత్​రెడ్డి ఆయన దగ్గరికి వెళ్లి పరిపాలన ఎలా చేయాలో నేర్చుకోవాలని ఎంపీ సూచించారు. రాష్ట్రంలో విద్యరాని వ్యక్తి విద్యాశాఖకు మంత్రిగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో ఫీజు​ రీయింబర్స్​మెంట్​ బకాయిలు చెల్లించాలంటే కమీషన్లు కావాలని రేవంత్​రెడ్డి అడుగుతున్నాడని ఆరోపించారు. ఎంసెట్​లో పదివేలలోపు ర్యాంక్​ వస్తేనే బకాయిలు చెల్లిస్తామని సైతం రూల్​ తీసుకొచ్చారన్నారు. ప్రజా ఉద్యమాలకు విద్యార్థులను వాడుకుని తర్వాత వారిని వదిలేశారన్నారు.

Fee Reimbursement Arvind | రేవంత్​రెడ్డి కమీషన్లు పక్కకు పెట్టి..

రేవంత్​ రెడ్డి ముందు తన కమీషన్లు పక్కన పెట్టి ఫీజు రీయింబర్స్​మెంట్​ విడుదల చేయాలని ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా డిమాండ్​ చేశారు. దేశ భవిష్యత్తుకు యువతే ఆధారమని పేర్కొంటూ అనేక పథకాలను పీఎం మోదీ తీసుకొస్తుంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్​ సర్కారు యువత ఉసురు పోసుకుంటోందన్నారు. విద్యార్థుల రీయింబర్స్​మెంట్​ను పక్కన పెట్టి మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్​ సిటీ అంటూ తిరుగుతున్నాడన్నారు. ‘తొక్కుతా.. మెడలో వేసుకుంటా..’ అంటూ రేవంత్​రెడ్డి రాష్ట్రానికి సీఎంగా కాకుండా ఒక వీధి రౌడీగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.  విద్యార్థులు భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలకు బీజేపీ ఆధ్వర్యంలో పూర్తి మద్దతు ఇస్తామన్నారు.

Fee Reimbursement Arvind | అహంకారం తలకెక్కింది..

సీఎం రేవంత్​రెడ్డికి అహంకారం తలకెక్కిందని ఎమ్మెల్యే రాకేష్​రెడ్డి అన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు ఫీజు రీయింబర్స్​మెంట్​ లేక గోస పడుతున్నారన్నారు. నేటి విద్యార్థుల భవిష్యత్తే దేశ భవిష్యత్తు అని వారి​ బకాయిలు ఆపి అధోగతి పాలు చేయవద్దని రాకేష్​ రెడ్డి కోరారు. రేవంత్​రెడ్డి.. ఆయన అన్నదమ్ములు కలిసి రాష్ట్రంలో వేలకోట్ల అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా  అధ్యక్షుడు దినేష్​ కులాచారి, రాష్ట్ర కార్యదర్శి స్రవంతిరెడ్డి, కార్యవర్గ సభ్యులు కంచెట్టి భూమన్న, మల్లికార్జున్​ రెడ్డి, గద్దె భూమన్న, బీజేపీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Fake Documents | ఫేక్​ డాక్యుమెంట్లు సృష్టించిన ముఠా అరెస్ట్​..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *