Fake Documents | ఫేక్​ డాక్యుమెంట్లు సృష్టించిన ముఠా అరెస్ట్​..

ఫేక్​ డాక్యుమెంట్లు సృష్టించి ఇంటిని ఇతరుల పేరిట మార్చిన ముఠాను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్​ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Fake Documents | ఫేక్​ డాక్యుమెంట్లు సృష్టించి ఇంటిని ఇతరుల పేరిట మార్చిన ముఠాను ఎట్టకేలకు పోలీసులు (Nizamabad Police) అరెస్ట్​ చేశారు. ఈ మేరకు మూడో టౌన్ ఎస్సై హరిబాబు వివరాలు వెల్లడించారు.

Fake Documents | డాక్యుమెంట్​ రైటర్​ సాయంతో..

ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం..  నగరంలోని మూడోటౌన్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని చంద్రశేఖర్​ కాలనీలో నివాసముండే మహిళ భర్త గతంలో మరణించాడు. అతడి పేరిట అదే కాలనీలో 50 గజాల స్థలంలో ఇల్లు ఉంది. భర్త మరణించిన అనంతరం ఆమె తన బంధువుల ఇళ్లలోనే ఉంటోంది. దీంతో ఖాళీ ఇంటిని గమనించిన ఇర్ఫాన్​, సలీం, శివకుమార్​, పోశెట్టి, శ్రీనివాస్ ఐదుగురు వ్యక్తులు​ కలిసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. అనంతరం ఇతరుల పేరిట మార్చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సదరు బాధితురాలు మూడో టౌన్​లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అనంతరం ఈ ఐదుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు.

ఇది కూడా చదవండి..: Dalit Sarpanch Attack Dichpally | అధికార గర్వం.. అగ్రకుల అహంకారం!.. నిధుల దుర్వినియోగాన్ని ప్రశ్నించిన దళిత ఉప సర్పంచిపై మహిళా సర్పంచి భౌతిక దాడి.. ఆమె భర్త బూతు పురాణం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *