US Airstrikes Chabahar | ఇరాన్‌లోని చాబహార్ పోర్టుపై అమెరికా దాడులు

ఇరాన్‌లోని చాబహార్ ఓడరేవు వద్ద కీలక మౌలిక సదుపాయాలపై అమెరికా దాడులు చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: US Airstrikes Chabahar | ఇరాన్‌ (Iran)లోని చాబహార్ ఓడరేవు వద్ద కీలక మౌలిక సదుపాయాలపై అమెరికా దాడులు చేసింది. చాబహార్ పోర్టులో శుక్రవారం జరిగిన అమెరికా వైమానిక దాడుల కారణంగా మారిటైమ్‌ కంట్రోల్‌ టవర్ కూలిపోయింది.

కూలిపోతున్నట్లుగా కనిపిస్తున్న ఆ నిఘా టవర్ చిత్రాన్ని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ పంచుకున్నారు. చాబహార్ పోర్టు అమెరికా వైమానిక దాడులకు పదేపదే లక్ష్యంగా మారుతోంది. ఆ పోర్టుపై మూడో విడత దాడులు జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా అంగీకరించింది, కానీ టవర్ కూలిపోయిన విషయాన్ని ధృవీకరించలేదు. పోర్టులోకి జరిగే వాణిజ్య రవాణాను ఆ టవర్ పర్యవేక్షిస్తుందని ఇరాన్ పేర్కొంది.

US Airstrikes Chabahar | బాంబుల వర్షం

US Airstrikes Chabahar

ఇరాన్​లోని దక్షిణ ప్రాంతంలో దీవులు, నగరాలపై అమెరికా పెద్ద ఎత్తున దాడులు చేసింది. అహ్‌వాజ్‌, ఖేష్మ్‌, దాష్తి, సిరిక్‌, బందర్‌ ఈ లెంగేలో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. బందర్‌ ఈ ఖమీర్‌లో రెండు బ్రిడ్జిలు ధ్వంసం అయ్యాయి. ఇరాన్‌షహర్‌లో ఎయిర్‌పోర్టుపై సైతం యూఎస్​ దాడి చేసింది. అమెరికా దాడుల్లో ఇరాన్​లో ముగ్గురు చనిపోయారు.

ఇది కూడా చదవండి..: Trump China Allegations | చైనాపై ట్రంప్​ సంచలన ఆరోపణలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *