Shankarpally Tragedy | ఇద్దరు పిల్లలను బావిలో తోసేసి.. ఆత్మహత్య చేసుకున్న మహిళ

రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను బావిలో తోసి, తానూ దూకి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Shankarpally Tragedy | రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) శంకర్​పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను బావిలో తోసి, తానూ దూకి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది.

కొడంగల్‌ ప్రాంతానికి చెందిన వసంత, సుధాకర్ దంపతులు ఉపాధి కోసం నగరానికి వలస వచ్చారు. శంకర్‌పల్లి సమీపంలో కొత్తపల్లిలో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు కూతురు (15), కుమారుడు (10) ఉన్నారు. గురువారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో వసంత ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తన ఇద్దరు పిల్లలను తీసుకొని ఇంటి నుంచి బయటకు వచ్చింది.

Shankarpally Tragedy | కాపాడిన చెట్టుకొమ్మ

వసంత తన పిల్లలను బావిలోకి తోసి వేసింది. అనంతరం ఆమె సైతం దూకింది. ఈ ఘటనలో తల్లీ కూతుళ్లు చనిపోగా.. ఆ బాలుడిని చెట్టుకొమ్మ కాపాడింది. బావిలో పడుతున్న బాలుడు చెట్టుకొమ్మకు చిక్కుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న శంకర్​పల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Shabad Murder Case | రాజ్​కుమార్​ మృతదేహం తీసుకెళ్లని కుటుంబ సభ్యులు.. అనాథల అంత్యక్రియలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *