అక్షరటుడే, వెబ్‌డెస్క్ : SIR Registration | ప్రతి ఓటరు ‘ఎస్ఐఆర్’ ప్రక్రియలో పాల్గొన తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఆర్కే ఫౌండేషన్ ఛైర్మన్ రాజ్‌కుమార్ సూచించారు. పటాన్‌చెరు నియోజకవర్గం ముత్తంగి డివిజన్ పరిధిలోని మహిధర లక్సూరియా (Mahidhara Luxuria) విల్లా కమ్యూనిటీలో ‘SIR’ ఎన్యుమరేషన్ ఫారాల నమోదు ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఓటరు వివరాలను పక్కాగా నమోదు చేసేందుకు ప్రభుత్వ అధికారులు, రాజ్ కుమార్ ఫౌండేషన్ (RK Foundation) సభ్యులు సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టారు.
SIR Registration | విజయవంతం చేయాలి
ఈ ఎన్యుమరేషన్ ఫారాల భర్తీ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, మహిధర విల్లా కమ్యూనిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ (EC) సభ్యులు, ఆర్కే ఫౌండేషన్ సభ్యులు క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ఛైర్మన్ మాట్లాడుతూ.. డివిజన్ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ఓటరు, ప్రభుత్వం చేపట్టిన ఈ ఫారాల పూర్తి ప్రక్రియ ఎంతో కీలకమని తెలిపారు. ప్రతి ఓటరు, నివాసి తమ వివరాలను అందించాలని సూచించారు.
ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలను తప్పులు లేకుండా నింపాలని ఈసీ సభ్యులు సూచించారు. 2002కు ముందు ఓటు ఉన్న వారు, లేని వారు తమకు సంబంధించిన బాక్సులో మాత్రమే వివరాలు రాయాలన్నారు. ఏమైనా సందేహాలుంటే తమను సంప్రదించాలని సూచించారు.
దీనిని కూడా చదవండి : OU Affiliation Colleges | అనుమతి లేని కాలేజీల్లో చేరి మోసపోవద్దు : సీపీ సజ్జనార్
🙏