అక్షరటుడే, హైదరాబాద్: CV Anand DGP | తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (DGP)గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ (IPS Officer CV Anand) బాధ్యతలు స్వీకరించారు. పదవీ విరమణ చేసిన బి. శివధర్ రెడ్డి స్థానంలో ప్రభుత్వం ఆయన్ను ఈ అత్యున్నత పదవికి ఎంపిక చేసింది. ఇప్పటివరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన, శుక్రవారం డీజీపీ కార్యాలయంలో అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
CV Anand DGP | 30 ఏళ్లకు పైగా అనుభవం:
1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్‌కు పోలీస్ శాఖ (Police Department)లో సుమారు 30 ఏళ్లకు పైగా అపారమైన అనుభవం ఉంది. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పోలీసులకు మంచి పేరు ఉందన్నారు. విప్లవాత్మక మార్పులకు తెలంగాణ పోలీస్‌శాఖ ఒక బ్రాండ్ అని పేర్కొన్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడొద్దని ఆదేశించారు. సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.
CV Anand DGP | ఏఎస్పీగా కెరీర్ ప్రారంభం
వరంగల్ జిల్లా (Warangal District) ఏఎస్పీగా తన కెరీర్ ప్రారంభించిన సీవీ ఆనంద్, సుదీర్ఘకాలం పాటు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో విధులు నిర్వహించారు. క్షేత్రస్థాయి ఆపరేషన్లలో చురుగ్గా పాల్గొని సాహసోపేతమైన అధికారిగా గుర్తింపు పొందారు.
పోలీస్ కమిషనర్‌గా : హైదరాబాద్ (Hyderabad), సైబరాబాద్‌తో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో శాంతిభద్రతల పరిరక్షణలో తనదైన శైలిని ప్రదర్శించారు. మెట్రోపాలిటన్ పోలీసింగ్‌లో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు.
CV Anand DGP | హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా:
పోలీస్ విభాగంతో పాటు పరిపాలనా రంగంలో కూడా ఆయనకు మంచి పట్టు ఉంది. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయన అందించిన సేవలు ప్రశంసనీయం. తెలంగాణలో శాంతిభద్రతలను కాపాడటంతో పాటు, సాంకేతికతను జోడించి పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగనున్నారు. ఈ సందర్భంగా పలువురు పోలీస్ ఉన్నతాధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Petrol Bunk Scam | పెట్రోల్ బంక్‌లో నయా స్కామ్.. వాహనదారుల ఆందోళన

