అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Lulu Mall Gun Incident | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని కేపీహెచ్బీలో గల లులు మాల్లో గన్ కలకలం రేగింది. మాల్ పార్కింగ్ వద్ద రెండు కుటుంబాల మధ్య ఘర్షణ నెలకొనడంతో పోలీసులు అక్కడకు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు.
మాల్లోని సెల్లార్లో పార్కింగ్ ప్రాంతంలో ఓల్డ్‌సిటీకి చెందిన రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. దీంతో మాల్ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను సముదాయిస్తుండగా.. పాతబస్తీకి చెందిన సిద్ధిఖీ జేబులో తుపాకీని గుర్తించారు. దానిని స్వాధీనం చేసుకొని పరిశీలించారు. అయితే ఆ గన్‌కు లైసెన్స్ ఉన్నట్లు గుర్తించారు. లైసెన్స్ ఉన్నా.. గన్‌తో మాల్‌లోకి వెళ్లకూడదు. అయితే భద్రతా సిబ్బంది తనిఖీలు చేయకపోవడంతో గన్‌తో లోపలికి వెళ్లినట్లు గుర్తించారు.
Lulu Mall Gun Incident | యాజమాన్యంపై కేసు
లులు మాల్ ప్రవేశ మార్గంలో మెటల్ డిటేక్టర్, బ్యాగ్ స్కానింగ్ ఉంటాయి. సరైన తనిఖీలు చేసిన తర్వాతే వినియోగదారులన లోనికి అనుమతించాలి. అయితే సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేయకపోవడంతో సిద్దిఖీ గన్‌తో లోపలికి వెళ్లినట్లు గుర్తించారు. ఈ మేరకు లులు మాల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి..: SI Pujari Suspension | మైనర్ డ్రైవింగ్‌కు ప్రోత్సాహం.. ఎస్సై పూజారి తిరుపతిపై సస్పెన్షన్