SBI Funds IPO | ‘ఎస్‌బీఐ ఫండ్స్’ ఐపీవో ప్రారంభం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. మంగళవారం ప్రారంభమైన సబ్‌స్క్రిప్షన్ గురువారం వరకు కొనసాగనుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : SBI Funds IPO | ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ భారతదేశపు పురాతన, అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలలో ఒకటి. మ్యూచువల్ ఫండ్ నిర్వహణలో 38 సంవత్సరాల అనుభవం ఉంది. దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India)తో పాటు అముండి సంస్థల జాయింట్ వెంచర్ ఇది.

దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థగా ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ నిలుస్తోంది. ఈ సంస్థకు 15.5 శాతం మార్కెట్ వాటా ఉంది. వివిధ పథకాల కింద సుమారు రూ. 12 లక్షల కోట్లకుపైగా ఆస్తులను నిర్వహిస్తోంది. భారతదేశంతో పాటు అంతర్జాతీయ ఉనికినీ కలిగి ఉంది.

SBI Funds IPO | 126 మ్యూచ్‌వల్ ఫండ్ పథకాలు..

సంస్థ ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత, డెట్, ఆర్బిట్రేజ్, ఈటీఎఫ్‌లు, ఇండెక్స్, ఓవర్సీస్ ఫండ్ ఆఫ్ ఫండ్‌లు మరియు లిక్విడ్ మరియు ఓవర్‌నైట్ ఫండ్‌లలో 126 మ్యూచువల్ ఫండ్ పథకాల యొక్క విభిన్న పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తోంది. గతేడాది డిసెంబర్ 31 నాటికి సంస్థ తన సేవలను 16.05 మిలియన్లకు పైగా పెట్టుబడిదారులకు అందించింది.

SBI Funds IPO | ఇష్యూ సైజ్..

ఈ సంస్థ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 9,813 కోట్లు సమీకరించనుంది. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్. ఈ ఐపీవో ద్వారా కంపెనీకి ఎలాంటి నిధులూ సమకూరవు. ఎస్‌బీఐ, అముండీ ఇండియా హోల్డింగ్ ఐపీవోలో భాగంగా తమ వాటాలు విక్రయిస్తున్నాయి.

ధరల శ్రేణి : ఐపీవో ధరల శ్రేణిని రూ.545 నుంచి రూ. 574గా నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్లు ఈ ఐపీవోలో పాల్గొనాలంటే కనీసం 26 షేర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గరిష్ఠ ప్రైస్ బ్యాండ్ వద్ద రూ.14,924 పెట్టుబడి పెట్టాలి. గరిష్ఠంగా 13 లాట్‌లకు దరఖాస్తు చేయవచ్చు.

SBI Funds IPO | రూ.54 డిస్కౌంట్.. వారికి మాత్రమే..

ఎస్‌బీఐ ఉద్యోగులకు రూ.170 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను రిజర్వ్ చేశారు. ఒక్కో షేరుపై రూ.54 డిస్కౌంట్ లభిస్తుంది.

కోటా, జీఎంపీ : క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 50 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, స్మాల్ హెచఎన్​ఐలకు 5 శాతం, బిగ్ హెచఎన్ఐ​లకు 10 శాతం కోటా రిజర్వ్ చేశారు. ఒక్కో షేరు గ్రే మార్కెట్‌లో రూ. 87 ప్రీమియంతో ట్రేడ్ అవుతోంది. అంటే లిస్టింగ్ సమయంలో 15 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.

ముఖ్యమైన తేదీలు : సబ్‌స్క్రిప్షన్ జూలై 14న ప్రారంభమై 16 వరకు అందుబాటులో ఉండనుంది. షేర్ల  అలాట్‌మెంట్ స్టేటస్ 17 న రాత్రి వెల్లయ్యే అవకాశాలున్నాయి. జూలై 21న కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో లిస్ట్ కానున్నాయి.

ఇది కూడా చదవండి..: Indian Stock Market | నష్టాల్లో దేశీయ మార్కెట్లు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *