May 30 Gold Rates | మళ్లీ బంగారం, వెండి ధరల పరుగులు.. ఒక్కరోజులోనే ఎంత పెరిగిందంటే!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 30 Gold Rates | బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు Silver Prices నాన్‌స్టాప్‌గా పరుగులు పెడుతున్నాయి. ఇటీవల రికార్డు స్థాయికి చేరుకున్న పసిడి ధరలు కొంతకాలం తగ్గుముఖం పట్టినప్పటికీ, మళ్లీ పెరుగుదల దిశగా సాగుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక, భౌగోళిక పరిణామాలు, పెట్టుబడిదారుల ఆసక్తి, పెరుగుతున్న డిమాండ్ కారణంగా బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి.శుక్రవారం బంగారం ధరల్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది.

ఒక్కరోజులోనే 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,600 మేర పెరిగింది. ఈ నేపథ్యంలో శనివారం (మే 30, 2026) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా మరింత పెరిగాయి.

akshara today .jpggold 0

May 30 Gold Rates | మారుతున్న ధ‌ర‌లు..

ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.10 పెరిగి రూ.1,57,650కు చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర కూడా రూ.10 పెరిగి రూ.1,44,510గా నమోదైంది. వెండి ధరలు కూడా పెరుగుదల బాటలోనే కొనసాగుతున్నాయి. కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.2,80,100కు చేరుకుంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం Gold 10 గ్రాముల ధర రూ.1,57,650గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,44,510గా ఉంది. వెండి కిలో ధర రూ.2,90,100గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,57,650గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,660గా ఉంది. వెండి కిలో ధర రూ.2,80,100గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,57,650, 22 క్యారెట్ల బంగారం రూ.1,44,510 వద్ద ట్రేడ్ అవుతుండగా, వెండి ధర రూ.2,80,100గా ఉంది.

చెన్నైలో Chennai దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే బంగారం ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,59,290 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,010గా నమోదైంది. వెండి కిలో ధర రూ.2,90,100గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం రూ.1,57,650, 22 క్యారెట్ల బంగారం రూ.1,44,510 కాగా, వెండి ధర రూ.2,80,100గా ఉంది.

May 30 Gold Rates | అనిశ్చిత పరిస్థితులు

నిపుణుల అభిప్రాయం ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు, సురక్షిత పెట్టుబడులపై పెరుగుతున్న ఆసక్తి, డాలర్ కదలికలు, కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు వంటి అంశాలు పసిడి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో కూడా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Minister Quarters Swimming Pool | ఒలింపిక్స్‌లో ‘మినిస్టర్’ మెడల్ పక్కా? క్వార్టర్స్‌లో రూ.2.63 కోట్లతో స్విమ్మింగ్ పూల్!

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *