NSE Trading Hours | ట్రేడింగ్ సమయం మారిందోచ్ !

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: NSE Trading Hours | డెరివేటివ్స్ (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) విభాగంలో ట్రేడింగ్ సమయాలను పొడిగించారు. ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (National Stock Exchange) ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం ఈక్విటీ డెరివేటివ్స్ సెగ్మెంట్‌లో సాధారణ ట్రేడింగ్ ముగింపు సమయం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 3.40 గంటలకు మారనుంది.

NSE Trading Hours

కాగా ప్రీ ఓపెన్ సెషన్, మార్కెట్ ప్రారంభ సమయాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ప్రీ ఓపెన్ సెషన్ 9 గంటలనుంచి 9.08 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత మార్కెట్ 9.15 గంటలకు ప్రారంభమవుతుంది. ఎనఎసఈ ఈ మార్పులను మాక్ ట్రేడింగ్ సెషన్‌ల ద్వారా పరీక్షించనుంది.

NSE Trading Hours | ట్రేడర్లకు మరింత వెసులుబాటు

NSE Trading Hours

క్లోజింగ్ ఆక్షన్ సమయంలో ఏర్పడే ధరల మార్పులను దృష్టిలో ఉంచుకుని, ఎఫ్ అండ్ వో ట్రేడర్లు తమ పొజిషన్లను హెడ్జ్ చేసుకోవడానికి, సర్దుబాటు చేసుకోవడానికి లేదా ఎగ్జిట్ కావడానికి అదనంగా 10 నిమిషాల సమయం లభించనుంది. దీంతో క్యాష్, డెరివేటివ్స్ మార్కెట్ల మధ్య ముగింపు సమయాల్లో ఉండే వ్యత్యాసం తగ్గి, ధరల ఆవిష్కరణ మరింత సమర్థవంతంగా జరిగే అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ఇది కూడా చదవండి..: Toyota Urban Cruiser EV | సింగిల్ చార్జ్‌తో 543 కి.మీ. రేంజ్!.. ఈవీ కారును లాంచ్ చేసిన టయోటా

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *