అక్షరటుడే, వెబ్‌డెస్క్: 2026 Pulsar 220F | దేశీయ టూవీలర్ మార్కెట్లో ఎన్నో కొత్త మోడళ్లు వస్తున్నా.. బజాజ్ పల్సర్ (Bajaj Pulsar)కు మాత్రం ఆదరణ తగ్గడం లేదు. తన స్పోర్టీ లుక్, శక్తిమంతమైన పనితీరు, ప్రత్యేక గుర్తింపుతో దాదాపు రెండు దశాబ్దాలుగా యువత హృదయాలను గెలుచుకుంటూ వస్తున్న ఈ బైక్.. తాజాగా సరికొత్త అప్డేటెడ్ ఫీచర్‌తో మళ్లీ వచ్చింది.
గతేడాది డిసెంబర్లో కొత్త గ్రాఫిక్స్, ఆకర్షణీయమైన రంగులతో ఈ బైక్‌ను అప్డేట్ చేసిన బజాజ్.. ఇప్పుడు 2026 మోడల్‌ను మరిన్ని మెరుగులతో పరిచయం చేసింది. కొత్త 2026 పల్సర్ 220 ఎఫ్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.36 లక్షలనుంచి మొదలవుతుంది. అప్డేటెడ్ బైక్ ధర సాధారణ బైక్ రేటు కంటే రూ. 8 వేలు ఎక్కువ.
2026 Pulsar 220F | భద్రతపైనే ప్రత్యేక దృష్టి..
కంపెనీ ఈసారి బైక్ ఐకానిక్ డిజైన్‌ను పెద్దగా మార్చకుండా రైడింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచే అంశాలపై దృష్టి పెట్టింది. భద్రత, రాత్రిపూట ప్రయాణ సౌకర్యాన్ని పెంచే అప్డేట్లు అందించింది. గత మోడల్లో లో బీమ్ కోసం ప్రొజెక్టర్, హై బీమ్ కోసం ప్రత్యేక మల్టీ రిఫ్లెక్టర్ యూనిట్ ఉన్నాయి. 2026 మోడల్లో బజాజ్ ఈ వ్యవస్థను పూర్తిగా మార్చి, లో, హై బీమ్ రెండింటినీ ఒకే సింగిల్ ఎల్ ఈడీ ప్రొజెక్టర్ యూనిట్లో అందించింది. దీంతో కాంతి మరింత స్పష్టంగా, విస్తృతంగా పడడంతో రాత్రి సమయంలో హైవే ప్రయాణాలు మరింత సురక్షితంగా మారనున్నాయి.
2026 Pulsar 220F | ఇంజిన్, పనితీరు..
ఈ అప్డేట్లో మెకానికల్ సెటప్‌లో ఎలాంటి కీలక మార్పులు చేయలేదు. ఈ బైక్‌కు శక్తినిచ్చే 220 సీసీ ఎయిర్/ఆయిల్ కూల్డ్, సింగిల్ సిలిండర్ డీటీఎస్ -ఐ ఇంజన్ ఉన్నాయి. ఇది 8,500 ఆర్పీఎం వద్ద 20.1 బీహెచ్పీ గరిష్ట శక్తిని, 7,000 ఆర్పీఎం వద్ద 18.55 ఎన్ ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది.
ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనకవైపు నైట్రాక్స్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. ఈ సస్పెన్షన్ సెటప్ కారణంగా గుంతలు, స్పీడ్ బ్రేకర్లు లేదా ఎగుడుదిగుడు రోడ్లప్ణైనా ప్రయాణం సాఫీగా సాగుతుంది. ముందువైపు, వెనకవైపు డిస్క్ బ్రేకులను అందించడం వల్ల బ్రేకింగ్ పనితీరు మరింత మెరుగుపడింది.
ఫీచర్లు : ఫీచర్ల పరంగా బైక్‌లో కొత్త డిజిటల్ ఎల్ సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించింది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీకి మద్దతు ఇవ్వడంతో పాటు రైడర్‌ను స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానించే సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఈ కొత్త డిస్ప్లే ద్వారా టర్న్ బై టర్న్ నావిగేషన్, ఇన్కమింగ్ కాల్ అలర్ట్స్, ఎస్సెమ్మెస్ నోటిఫికేషన్లు వంటి ఉపయోగకరమైన సమాచారాన్ని నేరుగా రైడర్‌కు చూపిస్తుంది.
ఇది కూడా చదవండి..: BSE Satvik Index | బీఎస్ఈలో ‘మోరల్ ఇన్వెస్ట్మెంట్స్.. అందుబాటులోకి సరికొత్త ‘సాత్విక్’ ఇండెక్స్