Former MLA Jeevan Reddy | ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డిపై జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు.. ‘ఆర్మూర్​ మంగళం శీను’ అంటూ కామెంట్స్​

ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆర్మూర్​ పట్టణంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్​: Former MLA Jeevan Reddy | ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై(Armoor MLA Rakesh reddy) మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పట్టణంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Former MLA Jeevan Reddy | ‘మంగళం శీను’తో పోలిక..

ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని ‘ఆర్మూర్ మంగళం శీను’ అంటూ జీవన్​రెడ్డి వ్యాఖ్యానించారు. ‘ఎర్ర చందనం స్మగ్లర్’ అంటూ కామెంట్ చేశారు. పుష్ఫ సినిమాలో మంగళం సీను క్యారెక్టర్​ ఎర్ర చందనం స్మగ్లింగ్​ చేస్తుంది. ఈ క్రమంలో జీవన్​రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి.  ఆర్మూర్‌లో భూముల కబ్జా జరుగుతోందని, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఆట స్థలాన్ని కూడా ఎమ్మెల్యే ఆక్రమించుకున్నారని ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతోందని.. హామీలిచ్చి మరిచిన కాంగ్రెస్​ నాయకులను తరిమి కొట్టాలని జీవన్ రెడ్డి అన్నారు. ఈ సీఎం రేవంత్ రెడ్డి కాదు.. హిట్లర్ రెడ్డి అని ఈ హిట్లర్ రెడ్డి మోదీ, బాబు కనుసైగల్లో పని చేస్తున్నారని జీవన్​రెడ్డి ఆరోపించారు.

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినిమాలు హిట్ అయినంత మాత్రాన సీఎం అవుతానని అనుకుంటే అది భ్రమేనని అన్నారు. పాన్ డబ్బాల లెక్క పది పార్టీలు పుడితే అందులో ఒక తోక పార్టీ జనసేన పార్టీ అని విమర్శించారు. తమ కౌన్సిలర్లకు ప్రోటోకాల్ ఇవ్వకుంటే 2000 మందితో మున్సిపాలిటీని ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్​ రైతు మిత్రుడిగా రైతు బంధు అందిస్తే, రేవంత్ రెడ్డి బూతుబంధుగా మారారని అన్నారు. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగుల పాలిట రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఒక హిట్లర్‌లా మారాడని విమర్శించారు. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదని, హిట్లర్ రాజ్యంగా, ఎమర్జెన్సీ రాజ్యంగా మార్చారని ఆరోపించారు.

Former MLA Jeevan Reddy | బీఆర్​ఎస్​ హయాంలో..

బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ హయాంలో రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలతో రైతులకు అండగా నిలిచామని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని మండిపడ్డారు. ఎకరానికి రెండు యూరియా బస్తాలు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం కొత్త సర్క్యులర్ తీసుకువచ్చిందని, వాటిని కూడా విడతల వారీగా ఇస్తామని చెప్పడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు.కేసీఆర్ హయాంలో అవసరమైన ఎరువులు రైతుల ఇంటి వద్దకే చేరేవని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతులంటే ఎందుకు ఇంత చిన్నచూపు అని ప్రశ్నించారు. రైతుల మోచేతులకు బెల్లం పెట్టి పంటలు కొనుగోలు చేయడం కుదరదన్నారు. వడ్లు, మక్కలు, జొన్నలు కొనుగోలు చేయకపోతే కాంగ్రెస్ నాయకుల ఇళ్ల ముందు రైతులతో కలిసి పంటలను పారబోస్తామని హెచ్చరించారు.

armoor 1

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *