నిజామాబాద్Bakrid Arrangements | బక్రీద్ పండుగకు ముమ్మర ఏర్పాట్లు: మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఇప్ప ఉమారాణి

Bakrid Arrangements | బక్రీద్ పండుగకు ముమ్మర ఏర్పాట్లు: మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఇప్ప ఉమారాణి

బక్రీద్ సందర్భంగా మైనారిటీలకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేస్తామని మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఇప్ప ఉమారాణి తెలిపారు.

అక్షరటుడే, కామారెడ్డి: Bakrid Arrangements | బక్రీద్ సందర్భంగా మైనారిటీలకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేస్తామని మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఇప్ప ఉమారాణి  (Ippa Umarani) తెలిపారు. పట్టణంలోని ప్రధాన ఈద్గాల వద్ద జరుగుతున్న పనులను కౌన్సిలర్లు, అధికారులతో కలిసి ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను ఆరా తీశారు.

Bakrid Arrangements | ఎలాంటి ఇబ్బందులు లేకుండా..

ముస్లింలకు ప్రార్థనల సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈద్గా పరిసరాల్లో పిచ్చిమొక్కలు తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, పండుగ రోజంతా శానిటేషన్ సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. ఈద్గాలకు వెళ్లే దారుల్లోని గుంతలు పూడ్చాలని, వీధి దీపాలను పునరుద్ధరించి వెళుతురు సమస్య లేకుండా చూడాలన్నారు. ప్రార్థనలకు వచ్చే భక్తుల కోసం తగిన తాగునీటి వసతి కల్పించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఛైర్​పర్సన్​ మాట్లాడుతూ.. పండుగ రోజు భక్తులకు అసౌకర్యం కలగకుండా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ముస్లింలు ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈ హన్మంత్ రావు, కౌన్సిలర్లు గ్యార అఖిల, వాజీద్, అంజాద్, జావీద్, అన్వర్, లడ్డు, నిట్టు గంగాధర్, కో-ఆప్షన్ మెంబర్ అలీబిన్ అబ్దుల్లా, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గ్యార సాయిలు, అమీర్, మున్సిపల్ అధికారులు, అమీర్, హైమద్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Jawaharlal Nehru Services | దేశానికి జవహర్ లాల్ నెహ్రూ చేసిన సేవలు మరువలేనివి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

May 30 Horoscope | కష్టాలకు ఇక ఎండ్​ కార్డ్​.. ఈ రాశుల వారికి నేడు ఆకస్మిక ధన యోగం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 30 Horoscope | గ్రహాల సంచారంలో వస్తున్న...

Minister Quarters Swimming Pool | ఒలింపిక్స్‌లో ‘మినిస్టర్’ మెడల్ పక్కా? క్వార్టర్స్‌లో రూ.2.63 కోట్లతో స్విమ్మింగ్ పూల్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Minister Quarters Swimming Pool | తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను...

Japan Population Crisis | సూర్యుడు ఉదయించే దేశంలో.. శృంగార అస్తమయం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Japan Population Crisis | జపాన్.. సాంకేతికతకు మారుపేరు....

VH Criticizes Congress Ministers | మంత్రులూ.. పద్ధతి మార్చుకోండి: సొంత ప్రభుత్వంపై ‘వీహెచ్‌’ ఫైర్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: VH Criticizes Congress Ministers | తెలంగాణ రాష్ట్రంలో అధికార...