Hyderabad LIG Housing | హైదరాబాద్​లో పేదలకు గుడ్​న్యూస్​.. లక్ష ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad LIG Housing | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో నివసించే పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తొలి విడతలో నగరంలో లక్ష ఎల్‌ఐజీ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy), మంత్రి అజారుద్దీన్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో కలిసి నాంపల్లి, మలక్‌పేట్, బహదూర్‌పురా నియోజకవర్గాల్లో ఎల్‌ఐజీ ఇళ్ల నిర్మాణానికి అనువైన స్థలాలను బుధవారం పరిశీలించారు. కుల్సుంపురా, అఫ్జల్ సాగర్ ప్రాంతాలతో పాటు కాలదేరా, గడ్డియన్నారం ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాలను కూడా పరిశీలించారు. వినియోగంలో లేని ప్రభుత్వ భూములు, భవనాలను ప్రజల అవసరాలకు అనుగుణంగా వినియోగించి పేదలకు గృహ వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.

Hyderabad LIG Housing | సీఎం ఆదేశాల మేరకు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు మెరుగైన జీవన వసతులు కల్పించే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి పొంగులేటి అన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్లను అందించేందుకు ఎల్‌ఐజీ గృహ నిర్మాణ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. తొలి విడతలో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. అవసరమైన స్థలాల గుర్తింపు, ప్రణాళికలు, మౌలిక వసతుల కల్పనపై అధికారులు చర్యలు చేపడుతున్నారని వివరించారు.

ఇది కూడా చదవండి..: One Hyd Park | హైదరాబాద్‌లో స్మార్ట్ హోమ్స్.. స్నైడర్ ఎలక్ట్రిక్ బిగ్ పార్టనర్‌షిప్

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *