Jeddah Tower | వామ్మో.. కిలోమీటర్ ఎత్తా!.. జెడ్డాలో 100 అంతస్తులు పూర్తయిన నిర్మాణం

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Jeddah Tower | సౌదీ అరేబియా (Saudi Arabia)లోని జెడ్డాలో చేపట్టిన నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా నిలవనుంది. కిలోమీటరు ఎత్తును దాటబోయే మొట్టమొదటి మానవ నిర్మిత కట్టడంగా చరిత్ర సృష్టించనుంది.

Jeddah Tower | బుర్జ్ ఖలీఫాను మించి..

ఇప్పటివరకు ప్రపంచంలో ఎత్తైన మానవ నిర్మిత కట్టడంగా దుబయిలోని బుర్జ్ ఖలీఫాను చెప్పుకుంటున్నాం. దాని ఎత్తు 828 మీటర్లు (2,717 అడుగులు). అయితే అంతకుమించిన ఎత్తుతో మరో కట్టడం నిర్మితమవుతోంది. సౌదీ అరేబియా యువరాజు అల్-వలీద్ బిన్ తలాల్ జెడ్డాలో జెద్దా టవర్స్ పేరుతో కిలోమీటర్ (3,281 అడుగులు) ఎత్తుతో 167 అంతస్తులతో ఆకాశహార్మ్యాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వంద అంతస్తుల నిర్మాణం పూర్తయ్యింది.

Jeddah Tower | ఎప్పుడు ప్రారంభించారంటే..

బుర్జ్ ఖలీఫాను డిజైన్ చేసిన అమెరికన్ ఆర్కిటెక్ట్ అడ్రియన్ స్మిత్ జెడ్డా టవర్‌ను డిజైన్ చేశారు. ఇందులో హోటళ్లు, ఆఫీసులు, నివాస గృహాలు మరియు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అబ్జర్వేషన్ డెక్ ఉండనున్నాయి. ఈ ప్రాజెక్ట్ సృష్టికర్త సౌదీ అరేబియా యువరాజు అల్ వలీద్ బిన్ తలాల్. ఇతను కింగ్‌డమ్ హోల్డింగ్ కంపెనీ(కేహెచ్సీ) కి చైర్మన్. కేహెచ్ సీ అనేది జెడ్డా ఎకనామిక్ కంపెనీ లో భాగస్వామి. ఇది జెడ్డా టవర్ మరియు సిటీ అభివృద్ధి కోసం 2009లో ఏర్పడింది. ఈ కేహెచ్ సీ ఆధ్వర్యంలో 1.23 బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో 2013 ఏప్రిల్ 1న టవర్ నిర్మాణం ప్రారంభమైంది. అయితే వివిధ కారణాల వల్ల 2018లో తాత్కాలికంగా పనులు నిలిచిపోయాయి. 2017-2019 మధ్యలో సౌదీ అరేబియా ప్రక్షాళన, కోవిడ్ -19 మహమ్మారి కారణంగా పనులు సాగలేదు.

Jeddah Tower | 2028 నాటికి పూర్తయ్యే అవకాశం..

2017లో నిలిచిపోయిన పనులు 2025 లో పున:ప్రారంభమయ్యాయి. గతనెలలో నిర్మాణం 400 మీటర్లకుపైగా ఎత్తుకు చేరుకుంది. 100 అంతస్తుల నిర్మాణం పూర్తయ్యింది. ఈ భారీ ప్రాజెక్ట్ 2028 నాటికి పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే ప్రపంచంలో కిలోమీటర్ ఎత్తున్న మొదటి భవనంగా నిలుస్తుంది.

ఇది కూడా చదవండి..: KOSPI Surge | నాలుగున్నర నెలల్లో డబుల్..! వంద శాతం పెరిగిన దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *