NAAC Training | నిరుద్యోగ యువతకు న్యాక్ ద్వారా శిక్షణ: కలెక్టర్ ఇలా త్రిపాఠి

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​అర్బన్​: NAAC Training | జిల్లాలోని నిరుద్యోగ యువతకు విరివిగా ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో న్యాక్ (NAAC) ద్వారా ఆయా ట్రేడ్​లలో శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అన్నారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు.

NAAC Training | శిక్షణతో పాటు ఉపాధి..

మూడు నెలల శిక్షణ కాలానికి గాను రూ.18వేల రుసుము ఉండగా, జిల్లా యంత్రాంగం తరపున 50 శాతం రాయితీని కల్పిస్తామన్నారు. అభ్యర్థులు కేవలం రూ. 9వేలు (మూణ్నెళ్లకు) మాత్రమే చెల్లించి ఎలక్ట్రీషియన్ (Electrician), ప్లంబర్(plumber course), మేసన్, టైలరింగ్ ట్రేడ్లలో శిక్షణ పొందవచ్చని సూచించారు. శిక్షణ కాలంలో అనుభవజ్ఞులైన ట్రైనర్లతో అభ్యర్థులకు నైపుణ్యాభివృద్ధి కోసం ప్రాక్టికల్స్​తో పాటు థియరీలో నాణ్యమైన శిక్షణ అందించబడుతుందన్నారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించబడతాయని కలెక్టర్ తెలిపారు.

NAAC Training | శిక్షణలో అన్నిరకాల సౌకర్యాలు..

శిక్షణ సందర్భంగా ఉచిత యూనిఫామ్, ఉచిత స్టేషనరీ, అధునాతన, సాంకేతికతతో కూడిన యంత్ర పరికరాలతో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు కలెక్టర్​ తెలిపారు. అనుభవజ్ఞులైన ఇన్స్ట్రక్టర్లతో సమర్ధవంతమైన శిక్షణ, న్యాక్ ద్వారా గుర్తింపు పొందిన సర్టిఫికెట్ అందించనున్నట్లు పేర్కొన్నారు. న్యాక్ సంస్థ ద్వారా ఇదివరకు వివిధ ట్రేడ్లలో విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు పూర్తిస్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయన్నారు. శిక్షణ తరగతులను న్యాక్ అధికారులు కట్టుదిట్టంగా పర్యవేక్షణ జరుపుతారని, అభ్యర్థులకు నాణ్యమైన శిక్షణ అందేలా కృషి చేస్తారన్నారు.

NAAC Training | 35 ఏళ్లలోపు వారే..

పదో తరగతి ఆపై విద్యార్హతలు కలిగి ఉండి, 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు గల నిరుద్యోగ యువతీయువకులు ప్రస్తుతం ఎలక్ట్రీషియన్​, ప్లంబర్, మేసన్, టైలరింగ్ ట్రేడ్లలో మూడు నెలల శిక్షణ పొందేందుకు అర్హులని సూచించారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు 2026 జూన్ 9వ తేదీలోపు నిజామాబాద్ కలెక్టరేట్ సమీపంలో ఉన్న న్యాక్ కేంద్రంలో నేరుగా దరఖాస్తులను అందించవచ్చన్నారు. వివరాలకు న్యాక్ కేంద్రం సహాయ సంచాలకులు లింబాద్రి, 9296507557ను సంప్రదించవచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

ఇది కూడా చదవండి: Hyderabad LIG Housing | హైదరాబాద్​లో పేదలకు గుడ్​న్యూస్​.. లక్ష ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *