Collector Ila Tripathi | స్త్రీశక్తి భవనానికి వర్చువల్​గా సీఎం శంకుస్థాపన.. పాల్గొన్న కలెక్టర్​ ఇలా త్రిపాఠి

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Collector Ila Tripathi | తెలంగాణ మహిళలు దేశానికే ఆదర్శమని సీఎం రేవంత్​రెడ్డి (Revanth Reddy) అన్నారు. సచివాలయంలో సోమవారం 8వేల ‘స్త్రీ శక్తి’ (Sthree Shakti) భవనాలకు ఆయన వర్చువల్​గా శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కలెక్టర్​ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు.

Collector Ila Tripathi | మహిళా వారోత్సవాల సందర్భంగా..

మహిళా వారోత్సవాల సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో నాలుగు కొత్త డిజైన్ల ఇందిరమ్మ చీరలను(Indiramma Sarees) కూడా సీఎం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ​2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్​ ప్రభుత్వ లక్ష్యమన్నారు. బ్యాంక్ లింకేజీ రుణాల పరిమితి రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. డీమార్ట్(Dmart), బిగ్ బజార్లకు పోటీగా ‘మహిళా శక్తి సూపర్ బజార్లు’ ఏర్పాటు చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలు(Grain Procurement), నిల్వ, మిల్లింగ్ బాధ్యతలు మహిళా సంఘాలకే అప్పగించనున్నట్లు తెలిపారు. మహిళా సంఘాల ద్వారా 1000 ఆర్టీసీ బస్సుల కొనుగోళ్లు చేస్తున్నామని.. జూన్ 5న 553 బస్సులు ప్రారంభిస్తామన్నారు. ఈ వీడియోకాన్ఫరెన్స్​లో జిల్లాలోని ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

cm

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *