తెలంగాణPonguleti Challenge | ఇళ్లు కట్టకపోతే పోటీ చేయను.. కేటీఆర్​కు మంత్రి పొంగులేటి సవాల్​

Ponguleti Challenge | ఇళ్లు కట్టకపోతే పోటీ చేయను.. కేటీఆర్​కు మంత్రి పొంగులేటి సవాల్​

బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి సవాల్​ విసిరారు. హైదరాబాద్​లో వచ్చే రెండున్నరేళ్లలో ఇళ్లు నిర్మించకపోతే తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనని ప్రకటించారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ponguleti Challenge | బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ (KTR)కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి సవాల్​ విసిరారు. హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వచ్చే రెండున్నరేళ్లలో ఇళ్లు నిర్మించకపోతే తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనని ప్రకటించారు.

కేటీఆర్​ ఇటీవల మాట్లాడుతూ.. కాంగ్రెస్​ ప్రభుత్వం హైదరాబాద్​లో ఒక ఇల్లు కట్టినట్లు చూపించినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు. ఆయన వ్యాఖ్యలకు మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్​ స్పందించారు. పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో నిర్మించిన ఇళ్ల కంటే.. వచ్చే రెండున్నర సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇళ్లు నిర్మించకపోతే తాను వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని ప్రకటించారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇళ్లు నిర్మిస్తే కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటారా? అని ప్రశ్నించారు.

Ponguleti Challenge | ఆ గ్రామాల్లోనే ఓట్లు అడుగుతాం

రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Houses) ఇచ్చిన గ్రామాల్లోనే ఓట్లు అడుగుతామని మంత్రి పేర్కొన్నారు. బీఆర్​ఎస్​ నాయకులు కూడా వారు ఇళ్లు కట్టిన ప్రాంతాల్లో ఓట్లు అడగడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. ఇళ్ల పేరిట డ్రామాలు చేసే నాయకులు అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఓఆర్‌ఆర్ పరిధిలోని తొలి విడతగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఈ ఇళ్లను మహిళ పేరిట ప్రభుత్వం స్వయంగా రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తుందని, లబ్ధిదారులపై ఒక్క పైసా భారం కూడా ఉండదని స్పష్టం చేశారు.

Ponguleti Challenge | ప్రభుత్వ స్థలాలు గుర్తించాం

Ponguleti Challenge

మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)​ మాట్లాడుతూ.. బీఆర్​ఎస్​ హయాంలో కట్టిన ఇళ్ల కంటే తాము ఐదేళ్లలో ఎక్కువ కట్టి చూపిస్తామన్నారు. హైదరాబాద్​లో ఇల్లు లేని స్వంత ఖాళీ స్థలాలు ఉన్నవారు చాలా తక్కువగా ఉన్నారని తెలిపారు. దీంతో వారికి ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి స్థలాలు గుర్తించినట్లు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : Karnataka CM Change | కర్ణాటకకు కొత్త ముఖ్యమంత్రి.. రాజీనామా చేయనున్న సిద్ధరామయ్య!

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Minister Quarters Swimming Pool | ఒలింపిక్స్‌లో ‘మినిస్టర్’ మెడల్ పక్కా? క్వార్టర్స్‌లో రూ.2.63 కోట్లతో స్విమ్మింగ్ పూల్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Minister Quarters Swimming Pool | తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను...

Japan Population Crisis | సూర్యుడు ఉదయించే దేశంలో.. శృంగార అస్తమయం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Japan Population Crisis | జపాన్.. సాంకేతికతకు మారుపేరు....

VH Criticizes Congress Ministers | మంత్రులూ.. పద్ధతి మార్చుకోండి: సొంత ప్రభుత్వంపై ‘వీహెచ్‌’ ఫైర్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: VH Criticizes Congress Ministers | తెలంగాణ రాష్ట్రంలో అధికార...

Hormuz Strait Blockade | హార్ముజ్ జలసంధిపై దిగ్బంధనం ఎత్తివేత.. అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Hormuz Strait Blockade | వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యం...