అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల: KTR Lingannapeta Temple Visit | గంభీరావుపేట మండలం లింగన్నపేటలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్(KTR) దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ ప్రతినిధులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
KTR Lingannapeta Temple Visit | బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక పూజలు..
ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు హాజరైన కేటీఆర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి కేటీఆర్ వస్తున్నారన్న సమాచారంతో గ్రామస్తులు సైతం ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో లక్ష్మీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆయన వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: మహానంది ఆలయం సమీపంలో..నాన్ వెజ్ వంటకాలు తయారు