Eatala Rajender Support | ఎంపీ ఈటలకు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మద్దతు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Eatala Rajender Support | మల్కాజ్​గిరి ఎంపీ ఈటల రాజేందర్​కు బీజేపీ (BJP) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మద్దతుగా నిలిచారు. ఈటలకు వ్యతిరేకంగా మల్కాజ్​గిరి (Malkajgirir) నియోజకవర్గంలో ఫ్లెక్సీలు వెలిసిన విషయం తెలిసిందే. దీనిపై పలువురు బీజేపీ నేతలు స్పందించారు.

ఎంపీ ఈటలకు వ్యతిరేకంగా మేడ్చల్​ రింగ్​ రోడ్డు (ORR)​, ఇతర ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈటల ఏడుపే బీజేపీకి శాపం అని అందులో రాశారు. ఈ ఫ్లెక్సీల వ్యవహారం బీజేపీలో తీవ్ర చర్చకు దారి తీసింది. దీంతో బీజేపీ నేతలు ఈటలకు వ్యతిరేకంగా బ్యానర్లను ఏర్పాటు చేయడాన్ని ఖండించారు. ఈ మేరకు ఏడుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీల సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఒక నాయకుడిపై వ్యక్తిగత దాడి సరికాదన్నారు.

Eatala Rajender Flexis

Eatala Rajender Support | భయపడుతున్నారు

తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను చూసి కొందరు భయపడుతున్నారని ఆ పార్టీలు నేతలు వ్యాఖ్యానించారు. దీంతోనే ఐఖ్యత దెబ్బతీసేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్నారు. ఇది నీచ రాజకీయాలకు పరాకాష్ఠ అని విమర్శించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. తెలంగాణ బీజేపీ ఐక్యంగా ఉందన్నారు.

Eatala Rajender Support | దర్యాప్తు చేయాలి

ramchandar rao 1

ఫ్లెక్సీల వివాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు (Ramchandar Rao) స్పందించారు. బీజేపీ వ్యతిరేకస్తులే ఇలా చేశారన్నారు. బీజేపీలో ఐక్యత స్పష్టంగా కనిపిస్తుండడంతో ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలన్నారు. ఈ మేరకు డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

దీనిని కూడా చదవండి : Eatala Rajender Flexis | నీ ఏడుపే బీజేపీకి శాపం.. ఈటలకు వ్యతిరేకంగా ఫ్లెక్సీల కలకలం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *