Eatala Rajender Flexis | నీ ఏడుపే బీజేపీకి శాపం.. ఈటలకు వ్యతిరేకంగా ఫ్లెక్సీల కలకలం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Eatala Rajender Flexis | మల్కాజ్​గిరి ఎంపీ, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్​కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కలకలం రేపాయి. మేడ్చల్​ జిల్లా ఔటర్​ రింగ్ (ORR)​ రోడ్డు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

మేడ్చల్ జిల్లా ORR వద్ద బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా గుర్తుతెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. “నీ ఏడుపే బీజేపీకి శాపం” అంటూ ఈ ఫ్లెక్సీలపై రాసి ఉండటం స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదాస్పద ఫ్లెక్సీల వెనుక ఎవరున్నారనే కోణంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి వ్యక్తమవుతోంది.

Eatala Rajender Flexis | ఫ్లెక్సీల్లో ఏముందటే..

ఈటల రాజేందర్​ను ఉద్దేశించి ఫ్లెక్సీల్లో తీవ్ర వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని, కేంద్ర మంత్రి పదవి రాలేదని ఈటల ఏడుస్తున్నారనే కోణంలో అందులో రాశారు. బీజేపీ (BJP) ఈటలకు రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందన్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటల హుజురాబాద్, గజ్వేల్ (Gajwel)​ నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. రెండు సార్లు ఓడిపోయినా బీజేపీ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చిందని రాజేందర్​ను విమర్శిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మోదీ చరిష్మతో గెలిచినా.. తన ఇమేజ్​తోనే గెచిచానని ఈటల అనడం ఏ రాజకీయ నైతికత అని సదరు ఫ్లెక్సీలో ముద్రించారు.

mp rajender

Eatala Rajender Flexis | అర్వింద్​కు అనుకూలంగా..

సదరు ఫ్లెక్సీ నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Arvind)​కు అనుకూలంగా ఉండటం గమనార్హం. బీసీ నాయకులు ఎదుగుతుంటే అసహనం ఎందుకు, ఇందూరు బిడ్డ ఎంపీ అర్వింద్​కు వస్తున్న ఆదరణ చూసి కడుపు మంట ఎందుకని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణకు మరో మంత్రి పదవి ఇస్తారని సమాచారం.

బీసీ నాయకుడు ఈటల రాజేందర్​ మంత్రి పదవి రేసులో ఉన్నారు. ధర్మపురి అర్వింద్​ సైతం పదవి ఆశిస్తున్నారు. అయితే మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఇప్పటికే బండి సంజయ్​ కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన అర్వింద్​కు పదవి వస్తుందా లేక.. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్​ కులానికి చెందిన ఈటలకు వస్తుందా అనే చర్చ సాగుతోంది. ఈ క్రమంలో ఈటల రాజేందర్​కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలువడం తీవ్ర కలకలం రేపుతోంది. వీటిని ఎవరు ఏర్పాటు చేశారని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. బీజేపీలో అంతర్గత కలహాలకు ఈ ఫ్లెక్సీలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

bjp mp

దీనిని కూడా చదవండి : Harish Rao | యాదవులను పట్టించుకోని ప్రభుత్వం : హరీశ్​రావు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *