Telangana DEO Transfers | పలువురు డీఈవోల బదిలీ

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana DEO Transfers | రాష్ట్రంలో పలువురు డీఈవోలు బదిలీ అయ్యారు. డీఈవోలతో పాటు పలువురు బోధన, బోధనేతర సిబ్బందిని ట్రాన్స్​ఫర్​ చేసినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది.

చాలా కాలంగా ఒకేచోట పని చేస్తున్న విద్యాశాఖ అధికారులను ప్రభుత్వం ట్రాన్స్​ఫర్ చేసింది. జీవో నం.38 ప్రకారం పారదర్శకంగా బదిలీలు చేపట్టినట్లు పేర్కొంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నీకోలస్ (Naveen Nicholas) ఆదివారం వెల్లడించారు. బోధనేతర సిబ్బంది బదిలీలను ఆన్‌లైన్ విధానంలో చేపట్టినట్లు పేర్కొన్నారు. అడిషనల్ డైరెక్టర్ స్థాయి నుంచి ఆఫీస్ సబ్​ ఆర్డినేట్ స్థాయి వరకు పోస్టుల బదిలీ ప్రక్రియ పూర్తి చేశామన్నారు.

ias 1

Telangana DEO Transfers | బదిలీ అయిన డీఈవోలు

మేడ్చల్ డీఈవో (Medchal DEOO) విజయకుమారి మహబూబ్​నగర్​కు ట్రాన్స్​ఫర్​ అయ్యారు. వికారాబాద్​ నుంచి రేణుక మేడ్చల్​కు వచ్చారు. హైదరాబాద్​ విద్యాశాఖ అధికారి రోహిణి సంగారెడ్డికి బదిలీ అయ్యారు. సుశీందర్​రావు రంగారెడ్డి నుంచి నల్గొండకు వచ్చారు. అక్కడ పని చేస్తున్న భిక్షపతి భువనగిరికి బదిలీ అయ్యారు. రంగారెడ్డి డీఈవోగా రేవతిరెడ్డి నియమితులయ్యారు. సనంగారెడ్డి డీఈవోగా పని చేసిన వెంకటేశ్వర్లు హైదరాబాద్ డీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్​ శాస్త్రి సిద్దిపేట డీఈవోగా నియమితులయ్యారు.

deo office

దీనిని కూడా చదవండి : Telangana TET Schedule | తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *