Cyber Fraud | ‘ఆర్టీఏ చలాన్​’ లింక్​ను క్లిక్​చేసిన యువకుడు.. అకౌంట్​ నుంచి డబ్బులు మాయం

సైబర్ మోసగాళ్ల బారిన పడి ఓ యువకుడు తన బ్యాంక్​ ఖాతా నుంచి డబ్బులు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన బీర్కూర్​ మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, బీర్కూర్: Cyber Fraud | సైబర్ మోసగాళ్ల బారిన పడి ఓ యువకుడు తన బ్యాంక్​ ఖాతా నుంచి డబ్బులు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన బీర్కూర్​ మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

Cyber Fraud | ఆర్టీఏ ఈ చలాన్​ పేరుతో మెసేజ్​

బాధితుడి కథనం ప్రకారం.. నెల రోజుల క్రితం అతని వాట్సాప్‌కు ఆర్టీఏ ఈ-చలాన్ పేరుతో(RTA e challan scam) ఒక ఏపీకే ఫైల్ లింక్ వచ్చింది. అధికారిక సమాచారం అనుకుని మజ్హర్ అనే యువకుడు ఆ ఫైల్‌ను తన మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నాడు. ఆ సమయంలో అతని బ్యాంకు ఖాతాలో డబ్బులు లేవు. అయితే ఇటీవల అతని ఖాతాలో డబ్బులు జమ అయిన తర్వాత విడతల వారీగా రూ.95,100 నగదు వివిధ లావాదేవీల రూపంలో ఖాతా నుంచి మాయమైనట్లు గుర్తించాడు. బ్యాంకు నుంచి డబ్బులు డెబిట్ అయినట్లు మొబైల్‌కు సందేశాలు రావడంతో వెంటనే తన ఖాతాను పరిశీలించగా సైబర్ మోసానికి (online banking fraud) గురైనట్లు తెలుసుకున్నాడు.

Cyber Fraud | బీర్కూర్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు..

దీంతో బాధితుడు బీర్కూర్ పోలీస్ స్టేషన్‌లో(Birkur Police Station) ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసిన ఏపీకే ఫైల్ ద్వారా సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను సేకరించి ఈ మోసానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా వచ్చే తెలియని లింకులు, ఏపీకే ఫైళ్లు డౌన్‌లోడ్ చేయవద్దని, ప్రభుత్వ శాఖల పేరుతో వచ్చే సందేశాల నిజానిజాలను నిర్ధారించుకోవాలని సూచించారు. అనుమానాస్పద లావాదేవీలు జరిగిన వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని, సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.

ఇది కూడా చదవండి : Harish Rao Revanth Reddy | హిట్లర్​కు పట్టిన గతే సీఎం రేవంత్​కు పడుతుంది : హరీశ్​రావు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *