అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: CCTV Surveillance | సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను కట్టడి చేయవచ్చని సీపీ సాయి చైతన్య (CP Sai Chaithanya) అన్నారు. శనివారం ఆర్మూర్లో (Armoor) ఏర్పాటు చేసిన ప్రజాపలన ప్రగతి కార్యక్రమంలో సీపీ పాల్గొన్నారు.
CCTV Surveillance | శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత
శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని సీపీ అన్నారు. శాంతియుత వాతావరణం నెలకొని ఉన్న ప్రాంతాలు సత్వర అభివృద్ధి సాధిస్తాయని పేర్కొన్నారు. నేరాలు జరిగిన సందర్భాల్లో నిందితుల ఆచూకీ తెలుసుకునేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడుతాయన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
CCTV Surveillance | మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
మత్తు పదార్థాలు, దురలవాట్లకు యువత దూరంగా ఉండాలని హితవు పలికారు. రోడ్ సేఫ్టీ కమిటీని (Road Safety Committee) ఏర్పాటు చేసుకుని రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం కృషి చేయాలన్నారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్రజలకు భద్రతా కల్పించడానికి పోలీసు శాఖ ఎల్లవేళలా సమాయత్తంగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్మూర్ (Armoor) ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, ఆర్మూర్ ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్, ఆర్మూర్ మున్సిపాలిటీ ఛైర్పర్సన్ గోనె లహరి, వైస్ ఛైర్మన్ కాట్పల్లి వెంకటరెడ్డి, అగ్రికల్చర్ అధికారి రామకృష్ణ పాల్గొన్నారు.
CCTV Surveillance | వారంరోజుల్లో 194 డ్రంకన్ డ్రైవ్ కేసులు..
నిజామాబాద్ (Nizamabad) పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో 194 డ్రంకన్ డ్రైవ్ (Drunk driving) కేసులు నమోదయ్యాయని సీపీ తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయా కోర్టులు రూ.11,60,000 జరిమానా విధించాయని వివరించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ ట్రాఫిక్, బోధన్, ఆర్మూర్ కోర్టుల్లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారన్నారు. ఈ సందర్భంగా 194 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లుగా గుర్తించి ఆయా కోర్టులో వారిని ప్రవేశపెట్టినట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆరుగురికి వారంరోజుల జైలుశిక్ష విధించారని.. మిగిలిన వారికి రూ. 11,60,000/- జరిమానా విధించారని తెలిపారు.

ఇది కూడా చదవండి: Maruti Car Offers | మారుతిదీ అదే దారి.. కార్లపై భారీ ఆఫర్లు..
