అక్షరటుడే, ఎల్లారెడ్డి: BJP Victory Celebration | వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ (BJP) సాధించిన విజయాన్ని పురస్కరించుకొని పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు.
ఎల్లారెడ్డి (Yellareddy) పట్టణంలో మంగళవారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు అగల్ దివిటీ రాజేష్ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ వద్ద కార్యకర్తలు బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ “ఇది కేవలం రాజకీయ విజయం కాదు, దేశభక్తుల భావోద్వేగాలకు ప్రతిధ్వని” అని పేర్కొన్నారు.
BJP Victory Celebration | శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం..
బీజేపీకి ఇంతటి ఘనవిజయాన్ని అందించిన ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నామని నాయకులు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ (Telangana)లో కూడా ఇలాంటి ఫలితాలే రావాలంటే ప్రతి నాయకుడు, కార్యకర్త కంకణబద్ధులై పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మర్రి బాలకిషన్, జిల్లా ఉపాధ్యక్షుడు బత్తిని దేవేందర్, మాజీ అధ్యక్షుడు సతీష్, ప్రధాన కార్యదర్శులు శంకర్, శ్రీను, అశోక్, ఉపాధ్యక్షులు కాశినాథ్, శివ, సీనియర్ నాయకులు బలరాజ్, సత్యం, కోశాధికారి గజనాన్, దళిత మోర్చా నాయకులు పండరి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Harvester Fire Accident | కరెంట్ షాక్తో హార్వెస్టర్ దగ్ధం