అక్షరటుడు వెబ్‌డెస్క్:West Bengal Politics|పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త శకం ఆరంభం కాబోతోంది. ఈ నెల 9న రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం కొలువుదీరనుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య అధికారికంగా ప్రకటించారు. నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకుని, ఆయన ఆశీస్సులతో కొత్త పాలనకు శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో ఈ తేదీని ఖరారు చేసినట్లు ఆయన వెల్లడించారు. అయితే, ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చుంటారనే ఉత్కంఠకు ఇంకా తెరపడలేదు.
West Bengal Politics|ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు..
ఎన్నికల ప్రక్రియ ముగియడంతో, ఎన్నికల సంఘం అధికారులు గెలిచిన అభ్యర్థుల వివరాలతో కూడిన అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను నేడు ప్రధాన ఎన్నికల అధికారికి అందజేయనున్నారు. బుధవారం ఈ పత్రాలను గవర్నర్ ఆర్.ఎన్. రవికి సమర్పిస్తారు. అనంతరం, నిబంధనల ప్రకారం ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీని రాజీనామా చేయాల్సిందిగా గవర్నర్ కోరనున్నారు. కొత్త సీఎం బాధ్యతలు చేపట్టే వరకు ఆమె తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగుతారు.
West Bengal Politics|మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే కృష్ణేందు ముఖర్జీ..
బెంగాల్‌లో భాజపా గెలుపుతో మార్పులు అప్పుడే మొదలయ్యాయి. అసన్‌సోల్‌లో ఉద్రిక్తతల కారణంగా గత కొన్నేళ్లుగా మూతపడిన దుర్గాదేవి ఆలయం సోమవారం తిరిగి తెరుచుకుంది. తాను గెలిస్తే ఆలయాన్ని తెరిపిస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన భాజపా ఎమ్మెల్యే కృష్ణేందు ముఖర్జీ, విజయం సాధించిన వెంటనే తన మాట నిలబెట్టుకున్నారు. స్థానికులతో కలిసి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇది కూడా చదవండి: TVK Government Formation | ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి.. గవర్నర్కు టీవీకే చీఫ్ విజయ్ లేఖ

