అక్షరటుడే, కోటగిరి : Nizamsagar Water Release | నిజాంసాగర్ నీటిని వెంటనే విడుదల చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పోతంగల్ మండల బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం తహశీల్దార్ సందీప్‌కు వినతిపత్రం అందజేశారు.
Nizamsagar Water Release | వర్షాల్లేక వరినాట్లు..
అనంతరం మండల అధ్యక్షుడు కల్లూరి హన్మాండ్లు (బజరంగ్) మాట్లాడుతూ.. కష్టపడి వరి నాట్లు వేసిన రైతులు వర్షాలు పడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. బోర్లు ఎత్తిపోయి పొలాలకు నీరు అందక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు కోతలను విధిస్తూ రైతులకు ఇబ్బంది పాలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) నుంచి గోదావరి నది జలాలను తీసుకొచ్చి నిజాంసాగర్ ద్వారా నీటిని విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతులు గంగాధర్ పటేల్, సంతోష్ పటేల్, గంధపు హన్మాండ్లు, మక్కయ్య, కిరణ్, అర్జున్, రాజు, రాములు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Teacher Protest Telangana | ఉపాధ్యాయులపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తున్నాం..: దినేష్ కులాచారి