CCTV Cameras | సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ సాధ్యమే.. : సీపీ సాయిచైతన్య

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ప్రముఖమైనదని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​ : CCTV Cameras | నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ప్రముఖమైనదని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. వర్ని పోలీస్​స్టేషన్​ పరిధిలోని శ్రీనగర్​, జాకోరా జీపీలను బుధవారం ఆయన సందర్శించారు.

CCTV Cameras | 31 సీసీ కెమెరాల ప్రారంభోత్సవం..

ఈ సందర్భంగా శ్రీనగర్​, జాకోరా జీపీ కార్యాలయాల్లో ‘మన ఊరు –మన భద్రత – మన బాధ్యత’లో భాగంగా 31 సీసీ కెమెరాలను సీపీ సాయిచైతన్య ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషమన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని.. సీసీ కెమెరాల ద్వారా గ్రామంలో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను సులభంగా గుర్తించి తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చన్నారు. నేరాల నివారణలో సీసీ కెమెరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు.

CCTV Cameras | ట్రాఫిక్​ నియంత్రణలోనూ..

CCTV Cameras

ట్రాఫిక్ నియంత్రణలో కూడా ఈ కెమెరాలు పోలీసులకు సహాయపడతాయని సీపీ వివరించారు. ప్రజలు తమ ప్రాంతాల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పోలీస్ శాఖకు సహకరించాలని సూచించారు. పోలీస్ శాఖ చేపడుతున్న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలకు ప్రజలు ముందుకు వచ్చి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ వారి భద్రత కోసం సీసీ కెమెరాలను పెట్టుకోవాలని సూచించారు. ఇది వారి బాధ్యతగా తీసుకోవాలన్నారు. దుకాణాల యజమానులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

శ్రీనగర్ గ్రామంలో 15, జాకోర గ్రామంలో 16 కెమెరాలు పెట్టేందుకు సహకరించిన గ్రామ పంచాయతీలను పోలీస్ కమిషనర్ అభినందించారు. ఈ సందర్భంగా శ్రీనగర్, జాకోర గ్రామాలలో డ్రగ్స్ నివారణ, సైబర్ నేరాల పట్ల అవగాహన, రోడ్డు ప్రమాదాలను నివారణ కోసం అన్నీ రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రుద్రూర్ సీఐ కృష్ణ, వర్ని ఎస్సై వంశీ కృష్ణ, కోటగిరి ఎస్సై శ్రీనివాస్, రుద్రూర్ ఎస్సై మనోజ్, శ్రీనగర్ సర్పంచ్ పూర్ణిమ కిరణ్, జాకోరా సర్పంచ్ పెద్దసాయిలు, మాదాల చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు సుబ్బారావు, సెక్రెటరీ ఠాకూర్, రిటైర్డ్ సైంటిస్ట్ తోట చేతన్ కుమార్, ఏఎంసీ ఛైర్మన్ సురేష్ బాబు, ఉప సర్పంచ్ దస్తగిరి, బాలవికాస్ ట్రస్ట్ సభ్యులు చంద రాములు బాలయ్య, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Banswada Hostel | హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *