Other Duty Facility | పలు సంఘాల అధ్యక్షులకు ‘ఓడీ’ సౌకర్యం కల్పించిన ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులకు అదర్​ డ్యూటీ (ఓడీ) కల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Other Duty Facility | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులకు అదర్​ డ్యూటీ (ఓడీ) కల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వం 2026 క్యాలెండర్ సంవత్సరానికి డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్​, తెలంగాణ తహశీల్దార్ల అసోసియేషన్​, తపస్​ (తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం), స్కూల్ టీచర్స్​ ఫెడరేషన్​, ప్రభుత్వ జూనియర్​ లెక్చరర్ల అసోసియేషన్​ అధ్యక్షులకు రొటేషన్ పద్ధతిలో “Other Duty” సౌకర్యాన్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.

Other Duty Facility | ఓడీ అంటే ఏమిటీ?

అదర్ డ్యూటీ అంటే ఉద్యోగి తన సాధారణ విధులు చేసే స్థానంలో కాకుండా, శాఖ లేదా ప్రభుత్వం అప్పగించే ప్రత్యేక పనులు నిర్వహించాల్సి ఉంటుంది. ఉద్యోగ సంఘాల నేతల విషయంలో కొన్ని ప్రభుత్వ శాఖల్లో లేదా సంస్థల్లో వారికి సంఘ కార్యకలాపాలు నిర్వహించేందుకు పరిమిత స్థాయిలో ఈ సౌకర్యం ఇస్తారు. దీంతో వారు ఉద్యోగుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, చర్చలు, సమావేశాలు, సంప్రదింపుల్లో పాల్గొనడం, సంఘానికి సంబంధించిన అధికారిక కార్యక్రమాలు నిర్వహించడం వంటి పనులు చేసుకునే అవకాశం ఉంటుంది.

దీనిని కూడా చదవండి : Waqf Board Inspector Bribe | ఏసీబీకి చిక్కిన వక్ఫ్​బోర్డు ఇన్​స్పెక్టర్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *