Bhukakpalli Hanuman Temple | భూకాన్​పల్లి హనుమాన్ ఆలయాభివృద్ధికి మంత్రి శంకుస్థాపన

కామారెడ్డి పట్టణంలోని భూకాన్​​పల్లి హనుమాన్ ఆలయ అభివృద్ధి పనులకు మంగళవారం సీతక్క శంకుస్థాపన చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Bhukakpalli Hanuman Temple | కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని సరంపల్లి శివారులో ఉన్న భూకాన్​​పల్లి హనుమాన్ ఆలయ అభివృద్ధి పనులకు మంగళవారం మంత్రి సీతక్క శంకుస్థాపన నిర్వహించారు. ఇటీవలే ఆలయాభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

Bhukakpalli Hanuman Temple | రూ.51 లక్షలు మంజూరు

ఆలయాభివృద్ధికి ప్రభుత్వం రూ.51 లక్షలు మంజూరు చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క (Minister Seethakka), ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో స్వామివారికి మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

Bhukakpalli Hanuman Temple | పనులు నాణ్యతతో చేపట్టాలి

ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో పనులు నాణ్యతతో చేపట్టి త్వరితగతిన ఆలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఇతర అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఇప్ప ఉమారాణి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, డీఎఫ్​వో నీరజ్ కుమార్ తిబ్రేవాల్, కౌన్సిలర్ నిట్టు గంగాధర్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Traffic Awareness Ganesh | ట్రాఫిక్​పై అవగాహన కోసం మట్టి వినాయకుడి ఏర్పాటు: ఎస్పీ రాజేష్ చంద్ర

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *