Traffic Awareness Ganesh | ట్రాఫిక్​పై అవగాహన కోసం మట్టి వినాయకుడి ఏర్పాటు: ఎస్పీ రాజేష్ చంద్ర

పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు వినూత్న రీతిలో మట్టి గణపతిని ఏర్పాటు చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Traffic Awareness Ganesh | పట్టణంలోని (Kamareddy Police) రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు వినూత్న రీతిలో మట్టి గణపతిని ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ పోలీస్ గెటప్​లో గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు.

Traffic Awareness Ganesh | వినాయకుడికి పోలీస్​ యూనిఫాం..

వినాయకుడికి పోలీసు యూనిఫాం, ట్రాఫిక్ హెల్మెట్ ధరింపజేసి, పక్కనే స్టాప్ బోర్డు, ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను ఏర్పాటు చేయడం విశేషంగా ఆకట్టుకుంటోంది. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పూర్తిగా మట్టితో తయారు చేసిన ఈ వినాయకుడు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాడు. ఈ వినూత్న మట్టి గణపతికి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(SP Rajesh Chandra) ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, సిగ్నల్ నిబంధనలు పాటించడం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం చాలా అవసరమని తెలిపారు. పండుగ సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. భక్తితో పాటు సామాజిక సందేశాన్ని ఇచ్చేలా ట్రాఫిక్ అవగాహన వినాయకుడిని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ వినూత్న ప్రయత్నానికి స్థానిక ప్రజల నుండి, భక్తుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, డిఎస్పీ మధుసూదన్, పట్టణ సిఐ నరహరి, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.

డీజే నిర్వహణపై పోలీసుల సీరియస్

567

గణేష్ నవరాత్రి ఉత్సవాలలో నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దంతో డీజేలు నిర్వహిస్తున్న వారిపై కామారెడ్డి జిల్లా పోలీసులు సీరియస్ అవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా నిబంధనలను ఉల్లంఘించి డీజేలు నిర్వహిస్తే కేసులు నమోదు చేసి, సామగ్రిని సీజ్ చేస్తున్నారు. తాజాగా సదాశివనగర్ మండలం వజ్జేపల్లి గ్రామంతో పాటు కామారెడ్డి మండలం శాబ్దిపూర్ తండాలో గణేష్ ఉత్సవాల సందర్భంగా అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున డీజే నిర్వహిస్తున్నారని, అధిక శబ్దంతో వృద్ధులు, చిన్నారులు, విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదులతో పోలీసులు స్పందించారు.

ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు ఆయా గ్రామాల్లో తనిఖీలు చేపట్టారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా, పోలీస్ శాఖ సూచనలను పట్టించుకోకుండా డీజే నిర్వహిస్తున్నట్లు నిర్ధారించారు. దీంతో ఉత్సవ నిర్వాహకులతో పాటు డీజే యజమానూలు, ఆపరేటర్‌లపై కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో ఉన్న డీజే వాహనం, సౌండ్ బాక్సులు, ఇతర సామగ్రిని పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ… గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, డీజేల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్లు, డీజేలు వాడకూడదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలంతా పోలీసులకు సహకరించాలని కోరారు.

ఇది కూడా చదవండి: పూజలు చేయకుండానే.. గణేశుడి నిమజ్జనం..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *