అక్షరటుడే, నిజామాబాద్ కల్చరల్: Ganesh Agaman | ఆది దేవుడు..విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు.. లంభోదరుడు.. ఇలా తీరొక్క రూపాల్లో దర్శనమిచ్చే బొజ్జ గణపయ్యలు మండపాలకు చేరుకుంటున్నారు. వినాయక చవితి(Vinayaka chavithi) సందర్భంగా సోమవారం ఉమ్మడి జిల్లాలో (Nizamabad) సందడి నెలకొంది.
Ganesh Agaman |భక్తిశ్రద్ధలతో గణేష్ ఆగమన్..
జిల్లా కేంద్రంలో రెండురోజులుగా భారీ గణనాథులను మండపాలకు తరలిస్తున్నారు. ఇక ఆదివారం రాత్రి నుంచి నగరంలో కోలాహలం ఊపందుకుంది. భారీ లైట్ల మధ్య, బ్యాండ్ మేళాలతో గణనాథులను భక్తులు తమ మండపాలకు తీసుకెళ్తున్నారు. అలాగే సోమవారం సాయంత్రానికి దాదాపుగా వినాయక విగ్రహాలు మండపాలకు చేరుకున్నాయి. ట్రాఫిక్ సమస్యలు రాకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఇక జిల్లా కేంద్రం నుంచి ఆయా గ్రామాలకు విగ్రహాలు సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు చేరుకుంటున్నాయి.
Ganesh Agaman | పోలీసుల భద్రతా ఏర్పాట్లు..
విగ్రహాలను తరలించే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రధాన కూడళ్లలో పోలీసు బృందాలతో నిఘా ఉంచారు. ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా వారు పర్యవేక్షిస్తున్నారు. భారీ విగ్రహాలు తరలించే క్రమంలో నిర్వాహకులకు పోలీసులు సాయం చేస్తున్నారు.
Ganesh Agaman | మార్కెట్లలో సందడి..
వినాయక చవితి సందర్భంగా నగరంలోని శివాజీనగర్, ఆర్ఆర్ చౌరస్తా, నెహ్రూపార్క్, గంజ్, రైల్వేస్టేషన్ ప్రాంతాలు సందడిగా మారాయి. విఘ్నేశ్వరుడి పూజల నిమిత్తం పూలు,పండ్లు, పూజా సామగ్రి కొనేందుకు ప్రజలు తరలిరావడంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడగా పోలీసులు పర్యవేక్షించారు.
ఇది కూడా చదవండి: ట్రావెల్స్ బస్సు బీభత్సం