అక్షరటుడే, ఇందూరు: Munnurukapu Dasara Celebrations | నిజామాబాద్ జిల్లా ( Nizamabad) మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో మున్నూరు కాపు కులస్థుల దసరా సంబరాలు నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ (Dharmapuri Sanjay) పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం వీడియో విడుదల చేశారు.
Munnurukapu Dasara Celebrations | అందరికీ ఆటల పోటీలు..
జిల్లా మున్నూరు కాపు సంఘం 30 ఏళ్ల క్రితం ఏర్పడిందని ధర్మపురి సంజయ్ తెలిపారు. మొదటిసారిగా మున్నూరు కాపులందరు ఒక్కచోట కలిసి సంబరాలు నిర్వహించేందుకు నిర్ణయించామన్నారు.
ఈ సందర్భంగా 23న శుక్రవారం నగరంలోని ప్రగతినగర్ మున్నూరుకాపు సంఘంలో ఉదయం 11 గంటలకు సంబరాలు ప్రారంభమవుతాయన్నారు. ప్రతి ఒక్క మున్నూరు కాపు కుటుంబం ఈ సంబరాల్లో పాల్గొనాలని కోరారు.
పిల్లలకు, పెద్దలకు, మహిళలకు ప్రత్యేకంగా ఆటలపోటీలు ఉన్నాయన్నారు. ప్రత్యేకంగా భోజన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని మున్నూరుకాపు కులస్థులందరూ ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.
ఇది కూడా చదవండి: దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూడాలి?