Padmanagar Durga Bhavani | పద్మానగర్‌లో వైభవంగా శ్రీ దుర్గా భవానీ శరన్నవరాత్రి ఉత్సవాలు

ఐదో వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు.. భజనలతో మార్మోగుతున్న అమ్మవారి ఆలయ ప్రాంగణం

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Padmanagar Durga Bhavani | నిజామాబాద్‌ Nizamabad నగరంలోని పద్మానగర్‌ రోడ్డు నంబర్‌ 1లో శ్రీ దుర్గా భవానీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శ్రీ దుర్గా భవానీ ఉత్సవ కమిటీ, కాలనీ వాసులు సంయుక్తంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఐదో వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

Padmanagar Durga Bhavani | అమ్మవారి సేవలో భక్తులు

ఉత్సవాల్లో భాగంగా భవానీమాత మాలధారులు నిత్యం అమ్మవారిని ప్రత్యేక పూజలతో కొలుస్తూ భక్తిని చాటుకుంటున్నారు. భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఉత్సవ ప్రాంగణం భక్తిమయంగా మారుతోంది. అమ్మవారి సేవలో భక్తులు పాల్గొంటూ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

ఐదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు సమన్వయంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. శరన్నవరాత్రి వేడుకలతో పద్మానగర్‌ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *