Bodhan Politics | బోధన్ మున్సిపాలిటీలో ఆధిపత్య పోరు.. షాడో ఛైర్మన్ వర్సెస్ కౌన్సిలర్లు

Balla Sandeep Kumar

అక్షరటుడే: బోధన్ : Bodhan Politics | బోధన్ మున్సిపాలిటీ (Bodhan Municipality)లో ఛైర్​పర్సన్​, కౌన్సిలర్ల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నంత విభేదాలు చేరుకున్నాయి.

బోధన్ మున్సిపల్ ఛైర్​పర్సన్​గా తూము పద్మ, వైస్ ఛైర్మన్​గా ఎంఐఎం పార్టీ (MIM Party)కి చెందిన మీరు ఇలియాస్ అలీ ఉన్నారు. అయితే ఛైర్​పర్సన్​ భర్త శరత్ రెడ్డి కూడా కౌన్సిలర్​గా గెలుపొంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్​ లీడర్​గా వ్యవహరిస్తున్నారు. శరత్ రెడ్డి షాడో ఛైర్మన్​గా అన్ని తానై వ్యవహరిస్తుండటంతో.. ప్రతిపక్ష కౌన్సిలర్లకు శరత్ రెడ్డికి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.

Bodhan Politics | గుర్తించడం లేదని..

Bodhan Politics

అధికార పార్టీ కార్యక్రమాలకు ప్రతిపక్ష కౌన్సిలర్లను ఆహ్వానించడం లేదంటూ కనీసం తమను కౌన్సిలర్లుగా గుర్తించడం లేదంటూ ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన బక్రీద్ సందర్భంగా పారిశుధ్య కార్మికులను మున్సిపాలిటీలో సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమానికి అధికార పార్టీ కౌన్సిలర్లు తప్ప ప్రతిపక్షాలను పిలువ లేదంటూ ఎంఐఎం, బీజేపీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై 11వ వార్డు బీజేపీ కౌన్సిలర్ భర్త కొల్లిపాక బాలరాజ్ శరత్ రెడ్డిని ప్రశ్నించడంతో వారి మధ్య వాగ్ వివాదం మొదలైంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. శరత్​రెడ్డి ఒంటెద్దు పోకడలతో ముందుకు వెళ్తున్నారని ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు.తమను కూడా ప్రజలు ఓటు వేసి గెలిపించాలని, కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు.

Bodhan Politics | కాంగ్రెస్​ వర్సెస్​ ఎంఐఎం

Bodhan Politics

కాంగ్రెస్ పార్టీ (Congress Party) వర్సెస్ ఎంఐఎం పార్టీ గొడవలు బోధన్ మున్సిపాలిటీలో తారాస్థాయికి చేరుకున్నాయి. వైస్ ఛైర్మన్​కు మున్సిపాలిటీలో ప్రత్యేక గది కేటాయించాలని ఎంఐఎం పార్టీ అడుగుతుంటే సాధ్యం కాదని అధికార పార్టీ చెబుతుంది. దీంతో వారి మధ్య విభేదాలు భగ్గు మంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ శరత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని, అధికార కార్యక్రమాలకు కూడా తమకు ఆహ్వానం ఉండడం లేదని ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు అంటున్నారు.

ఇది కూడా చదవండి..: Pension Live Authentication | వినాయక్​నగర్​లో పింఛన్ లైవ్​​ అథెంటికేషన్ ​

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *