Vinayaka Temple Reconstruction | వినాయక ఆలయ పునర్నిర్మాణానికి విరాళం

పట్టణంలో స్వయంభువుగా వెలసిన వినాయక ఆలయ పునర్నిర్మాణానికి మున్నూరు కాపు ఫౌండేషన్‌ సభ్యులు విరాళం అందజేశారు.

shashi kiran Mottala

 అక్షరటుడే, ​భీమ్‌గల్‌: Vinayaka Temple Reconstruction | పట్టణంలో (Bheemgal) స్వయంభువుగా వెలసిన వినాయక ఆలయ పునర్నిర్మాణానికి మున్నూరు కాపు ఫౌండేషన్‌(Munnuru Kapu Foundation) సభ్యులు విరాళం అందజేశారు. రజక సంఘం ఆధ్వర్యంలో ఈ నిర్మాణం జరుగుతోంది.

Vinayaka Temple Reconstruction | రూ.50 వేలు అందజేత

శిథిలావస్థకు చేరిన ఈ ఆలయ నిర్మాణ పనులను రజక సంఘం ఆధ్వర్యంలో చేపట్టారు. పలువురు దాతలు తమ వంతు సాయం అందిస్తున్నారు. ఈ క్రమంలో ఫౌండేషన్‌ ప్రతినిధులు రూ. 50,000 విరాళం చెక్కును రజక సంఘం ప్రతినిధులకు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలకు తమ సంస్థ ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. సాయం అందించిన ఫౌండేషన్ ప్రతినిధులకు రజక సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలుపుతూ, మిగతా దాతలు కూడా ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ నీలం రవి, నాయకులు బోదిరే నర్సయ్య, తేజ, చరణ్, అరవింద్, నవీన్, ప్రదీప్, సతీష్, విశాల్, రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *