అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Prajavani Complaints | ప్రజావాణి(Prajavani ) ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ భుజంగరావు(Bhujanga Rao) పేర్కొన్నారు. కలెక్టరేట్లో (Nizamabad Collectorate) నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ఫిర్యాదులు స్వీకరించారు.
Prajavani Complaints | 166 ఫిర్యాదులు..
ప్రజావాణికి 166 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అధికారులకు విన్నవించారు. ట్రెయినీ కలెక్టర్ సురేష్, డీఆర్వో గీత, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్నలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ భుజంగరావు అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు