Delimitation Bill | డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తే చరిత్ర ద్రోహులుగా మిగిలిపోతారు: రాహుల్ గాంధీ

పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని చూస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Delimitation Bill | పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని చూస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తీసుకురాబోయే ఈ బిల్లుకు ఏ పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వకూడదని కాంగ్రెస్‌తో పాటు అన్ని ప్రతిపక్ష, ప్రాంతీయ పార్టీలకు ఆయన గట్టి పిలుపునిచ్చారు.

Delimitation Bill | చరిత్రలో ద్రోహులుగా ముద్ర..

ఈ బిల్లుకు మద్దతు తెలిపే ఏ రాజకీయ పార్టీ లేదా నాయకుడైనా సరే, భవిష్యత్ తరాల దృష్టిలో , చరిత్ర పుటల్లో ద్రోహులుగా మిగిలిపోతారని ఆయన ఘాటుగా హెచ్చరించారు. పార్లమెంట్‌లో డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేసుకోవడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని, ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన రాజకీయ కుట్ర అని విమర్శించారు. ముఖ్యంగా, దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యతను , ప్రజల ప్రాతినిధ్య హక్కులను దెబ్బతీసేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఆయుధంగా వాడుకుంటోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.ఈ బిల్లు వెనుక ఉన్న కుట్రను గ్రహించి విపక్షాలన్నీ ఒక్కటి కావాలి. కాంగ్రెస్‌తో పాటు దేశంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ కలిసికట్టుగా పార్లమెంట్‌లో ఈ బిల్లును ఓడించాలని కోరారు.

ఇది కూడా చదవండి:  Dichpally Lorry Accident | జాతీయ రహదారిపై లారీ బోల్తా

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *