అక్షరటుడే, బోధన్: Amdapur Bonalu Festival | ఆషాఢమాసంలో ఊరూరా బోనాల (Bonalu) పండుగ సంబురాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మండలంలోని (bodhan) అమ్దాపూర్లో గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో బోనాలు నిర్వహించారు.
Amdapur Bonalu Festival | ప్రత్యేక పూజలు
ఆషాడ మాసంలో వచ్చే బోనాల పండుగను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఆడపడుచులు సాంప్రదాయబద్ధంగా ముస్తాబై అమ్మవారికి బోనాలు సమర్పించారు. గ్రామంలోని ఉజ్జయిని మాత ఆలయానికి పిల్లా పాపలతో బోనం ఎత్తుకొని ఆలయానికి పెద్దఎత్తున బయలుదేరారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి బోనాల సమర్పించి వర్షాలు బాగా కురిసి పాడిపంటలతో గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోరెడ్డి గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పల్లెన్న పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం స్పోకేన్లో అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు