Oora Panduga Bandobast | ఊర పండుగ బందోబస్తును పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

నగరంలో ఊర పండుగ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Oora Panduga Bandobast | నగరంలో ఊరపండుగ (Oora Panduga ) వేడుక అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్​శాఖ (Nizamabad Police) కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) బందోబస్తును పర్యవేక్షించారు.

Oora Panduga Bandobast | ఇబ్బందులు తలెత్తకుండా..

పండుగ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా , ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియను సీపీ సాయిచైతన్య క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఊరేగింపు నిర్వహించిన ప్రధాన ప్రాంతాలు, రద్దీ కూడళ్లు, ట్రాఫిక్ మళ్లింపు ప్రాంతాలు, పార్కింగ్ స్థలాలను సందర్శించి పోలీసు అధికారులు, సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. భక్తుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ప్రతి సున్నిత ప్రాంతంలో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.

Oora Panduga Bandobast | మహిళలు చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత

సీపీ మాట్లాడుతూ.. పండుగకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశమున్నందున వారి భద్రతకు ప్రాధాన్యతనిచ్చామని సీపీ పేర్కొన్నారు. పండుగ ప్రాంతమంతా సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించామన్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి తక్షణ చర్యలు తీసుకోవాలని కమిషనర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో నిజామాబాద్​ సీసీఆర్​బీ, సీసీఎస్​, ఏసీపీ ప్రకాశ్​ యాదవ్​, గురు నాయుడు, శ్రీశైలం, ట్రాఫిక్ సీఐ శ్రీ ప్రసాద్, టౌన్ సీఐ శ్రీ శ్రీనివాసరాజ్, సౌత్ రూరల్ సీఐ, సురేష్ కుమార్ ఎస్​హెచ్​వో రఘుపతి, ఎస్సైలు, స్పెషల్​ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Nizamabad Oora Panduga | భక్తిశ్రద్ధలతో ప్రారంభమైన ఊరపండుగ  ఊరేగింపు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *