అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Oora Panduga | భక్తిశ్రద్ధలతో నగరంలో ఊరపండుగ ఊరేగింపు ప్రారంభమైంది. సర్వసమాజ్ కమిటీ సభ్యులు వెంటరాగా.. అమ్మవార్లు ఖిల్లా శారదాంబ గద్దె నుంచి ఊరేగింపుగా బయలుదేరారు. భక్తులు ‘పులోరియా’ నినాదాలతో హోరెత్తించారు.
Nizamabad Oora Panduga | జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాట్లు
శనివారం సాయంత్రం వడ్లధాతి వద్ద అమ్మవార్ల దేవతామూర్తుల తయారీ ప్రక్రియను పూర్తిచేశారు. అనంతరం వాటికి భక్తితో పూజలు చేశారు. అక్కడి నుంచి సిర్నపల్లి గడిలో పూజలు నిర్వహించి అక్కడి నుంచి ఆదివారం తెల్లవారుజామున ఖిల్లా ముఖద్వారం వద్ద ఉన్న శారదాంబ గద్దె మీదికి తీసుకొచ్చారు. ఉదయం 6గంటల ప్రాంతంలో వాటిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సుమారు 9గంటల నుంచి అంగరంగ వైభవంగా ఊరేగింపు ప్రారంభమైంది.
Nizamabad Oora Panduga | వెంట నడిచిన సర్వసమాజ్ కమిటీ, కుల సంఘాలు
బండారు పోసిన అనంతరం ఊరపండుగ కార్యక్రమాలు నగరంలో ప్రారంభమయ్యాయి. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు సర్వసమాజ్ కమిటీ సభ్యులు, ఆయా కుల సంఘాల సభ్యులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అనంతరం ఉదయం ఊరేగింపులో పాల్గొన్నారు. ఖిల్లా శారదాంబ గద్దె వద్ద ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, మేయర్ ఉమారాణి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Nizamabad Oora Panduga | ‘సరి’కోసం ప్రత్యేక ఏర్పాట్లు
పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఊరేగింపు ప్రారంభమైన తర్వాత వివేకానంద చౌరస్తా వద్ద ‘సరి’ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా 10 గంటల ప్రాంతంలో సరిని తయారుచేసిన భక్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా తోపులాట జరగగా.. పోలీసులు నియంత్రించారు. కార్యక్రమంలో సర్వసమాజ్కమిటీ అధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ, కన్వీనర్ రామర్తి గంగాధర్, కో కన్వీనర్ ఆదె ప్రవీణ్‌కుమార్, కమిటీ సభ్యులు గాండ్ల లింగం, బీజేపీ కార్పొరేటర్లు మల్కాయి మహేందర్, న్యాలం రాజు, కాంగ్రెస్ డీసీసీ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నాయకులు రామర్తిగోపి, జనసేన నాయకుడు మీసాల శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి : Hardik Pandya | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హార్దిక్ పాండ్యా