అక్షరటుడే, మెండోరా : Sriram Sagar Flood | ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్‌కు వరద కొనసాగుతోంది. మహారాష్ట్రలో, స్థానికంగా కురిసిన వర్షాలతో ప్రస్తుతం జలాశయంలోకి 27,680 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.
శ్రీరామ్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1,074.30 అడుగుల (31.3టీఎంసీల)కు చేరింది. గతేడాది ఇదే సమయంలో జలాశయంలో 38.9 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా పడటంతో నీటిమట్టం తక్కువగా ఉంది. ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్ట్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.
Sriram Sagar Flood | కాకతీయ కాలువ ద్వారా..
జలాశయంలో నీటిమట్టం పెరగడంతో పాటు వరద కొనసాగుతుండటంతో అధికారులు కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతున్నారు. రానున్న రోజుల్లో భారీ వరద వస్తే ప్రాజెక్ట్ నిండుతుంది. ప్రతి ఏటా ఆగస్టు, సెప్టెంబర్‌లో జలాశయానికి భారీ వరద వస్తుంది. ప్రస్తుతం వరద కొనసాగుతుండటంతో ఆయకట్టు రైతులు పంటల సాగుకు సిద్ధం అవుతున్నారు. అన్ని కాలువల ద్వారా నీటిని విడుదల చేయాలని కోరుతున్నారు.
దీనిని కూడా చదవండి : Aug 02 Horoscope | కష్టానికి తగిన ప్రతిఫలం..ఈ రాశుల వారికి ఇక రాజయోగమే!