అక్షరటుడే, ఎల్లారెడ్డి: Tipper Engine Fire | రోడ్డుపై వెళ్తున్న ఓ టిప్పర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగలు, మంటలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే టిప్పర్‌ను (Tipper) అక్కడే నిలిపి కిందికి దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన నాగిరెడ్డిపేట(Nagireddypeta) మండలం బంజారా తండా సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది.
Tipper Engine Fire | మట్టిలోడ్‌తో వెళ్తున్న టిప్పర్..
ఎస్సై భార్గవ్ గౌడ్ (Nagireddypeta police) తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగిరెడ్డిపేట మండలం బంజారా తండా సమీపంలో మట్టిలోడ్‌తో వెళ్తున్న టిప్పర్‌లో మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఫైర్‌స్టేషన్ (Fire station) సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. వైరింగ్ డిఫాల్ట్ వల్లే (engine fire) మంటలు చెలరేగి ఉండొచ్చని డ్రైవర్, ఫైర్ అధికారులు పేర్కొన్నారు. వాతావరణంలో (Weather) మార్పుల కారణంగా ఎండలు తీవ్రం కావడంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, వాహనాలను జాగ్రత్తగా నడపాలని, ఇంజిన్ వేడెక్కకుండా తరచుగా తనిఖీ చేయించుకోవాలని ఎస్సై సూచించారు.
ఇది కూడా చదవండి: Revanth Reddy | గవర్నర్‌ను కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి

