Bandaru Ceremony Nizamabad | సర్వ సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా ‘బండారు’ కార్యక్రమం

నగరంలో ఊరపండుకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు ఘనంగా ప్రారంభమయ్యాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, ఇందూరు: Bandaru Ceremony Nizamabad | నగరం (Nizamabad)లో ఊరపండుకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. దీంట్లో భాగంగా ప్రధాన ఘట్టమైన బండారు పోసే కార్యక్రమాన్ని గురువారం భక్తిశ్రద్ధలతో సర్వసమాజ్​ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.

Bandaru Ceremony Nizamabad | జోరు వానలో..

ఉదయం నుంచి జోరుగా వాన కురుస్తున్నప్పటికీ సర్వసమాజ్​ కమిటీ సమక్షంలో శివాజీ నగర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో స్థానిక గాజుల్​పేట్​, అశోక్ వీధిలో బండారు పోసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వసమాజ్​ కమిటీ ముఖ్య సలహాదారుడు, శివాజీ నగర్ మున్నూరుకాపుసంఘం మాజీ అధ్యక్షుడు గాండ్ల లింగం మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆషాఢ మాసం ప్రారంభంలో ఊరపండుగ నిర్వహిస్తారన్నారు. దీంట్లో భాగంగా బండారు పోశామని.. ఈ రోజు నుంచి ఆదివారం వరకు ఊరపండుగకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు.

Bandaru Ceremony Nizamabad

ఊరి పొలిమేర దాటకూడదనే ఆచారం కొనసాగుతోందన్నారు. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా రోగాలు రాకుండా ఊరిదేవతలకు మొక్కులు చెల్లించుకునే దాంట్లో భాగంగా ఈ ఊరపండుగ జరుపుకుంటామని తెలియజేశారు. గురువారం నుంచి వడ్లధాతిలో దేవతామూర్తులను తయారు చేసే కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. ఆదివారం రోజు ఉదయం నుంచి ఊరపండుగ సందర్భంగా దేవతామూర్తులను ఖిల్లా కళాశాల వద్ద గద్దెవద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మహాలక్ష్మినగర్​, దుబ్బ తదితర ప్రాంతాల్లో మూర్తులను ప్రతిష్ఠిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాలన్నింటిని సర్వసమాజ్​ కమిటీ పెద్దల ఆధ్వర్యంలో పకడ్బందీగా నిర్వహిస్తున్నామని వివరించారు. బండారు పోసే కార్యక్రమంలో శివాజీనగర్​ మున్నూరుకాపు సంఘం పాలకవర్గం సభ్యులు, డైరెక్టర్లు, పెద్దకాపులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Kalyana Lakshmi Forgery Case | ‘గెజిటెడ్’​ సంతకాల ఫోర్జరీ కేసు.. విచారణపై ఉత్కంఠ!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *