GGH Newborn Death | జీజీహెచ్​లో నవజాత శిశువు మృతి.. వైద్యుల నిర్లక్ష్యమేనంటూ బంధువుల ఆందోళన

జిల్లా ఆస్పత్రిలో మరొక ప్రాణం ప్రపంచాన్ని చూడకుండానే కన్ను మూసింది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: GGH Newborn Death | జిల్లా ఆస్పత్రిలో మరొక ప్రాణం ప్రపంచాన్ని చూడకుండానే కన్ను మూసింది. నవజాత శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమేనని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. డీఎస్పీ మధుసూదన్ ఆధ్వర్యంలో బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.

GGH Newborn Death | లింగంపేట మండలం..

బాధితుల కథనం ప్రకారం.. లింగంపేట మండలం (Lingampet Mandal) ఎక్కపల్లి తండాకు చెందిన సరిచంద్​కు తాడ్వాయి మండలం నందివాడకు చెందిన స్వరూపతో 15 నెలల క్రితం వివాహమైంది. మెదటి కాన్పు కావడంతో పురిటి నొప్పులతో కామారెడ్డి జీజీహెచ్​కు శుక్రవారం ఉదయం వచ్చారు. అయితే నొప్పులు ఎక్కువగా ఉన్నాయని, ఆపరేషన్ చేయాలని కుటుంబ సభ్యులు వైద్యులను కోరారు. సాధారణ డెలివరీ అవుతుందని వైద్యులు జాప్యం చేయడంతో ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలని కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. దాంతో మీరే చేయండి ఆపరేషన్, మాకు తెలియదా.. ఏం చేయాలో కూడా మాకు చెప్తారా అంటూ సిబ్బంది బాధిత కుటుంబ సభ్యులపై దురుసుగా ప్రవర్తించారని కుటుంబ సభ్యులు తెలిపారు. అయినప్పటికీ ఆపరేషన్ చేయకుండా శనివారం ఉదయం వరకు వేచి చూసి ఆపరేషన్ చేయగా మృతి చెందిన మగబిడ్డ జన్మించాడని వాపోయారు. తమ ఇంటి వారసుడిని వైద్యులు పొట్టన పెట్టుకున్నారని, బిడ్డ చనిపోయిన విషయం కూడా తమకు చెప్పలేదని ఆరోపించారు. కాగా మృతి చెందిన మగ శిశువును పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం గది వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు

GGH Newborn Death | రక్త హీనతతో వచ్చారు..

– వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్

ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లును వివరణ కోరగా సదరు గర్భిణి ఆస్పత్రికి రక్త హీనతతో వచ్చిందని, దాంతో వైద్యులు రక్తం కూడా ఎక్కించారన్నారు. ఇవాళ ఆపరేషన్ చేస్తుండగా రక్తం తక్కువ ఉండటంతో కడుపులో ఉన్న బాబు ఊపిరి పీల్చుకోలేక ఇబ్బంది పడ్డాడని, వైద్యులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. దీనిపై అంతర్గత ప్రైమరీ ఎంక్వైరీ కమిటీ వేసి విచారణ జరుపుతామన్నారు. సిబ్బంది దురుసుగా మాట్లాడిన విషయంపై విచారణ చేస్తామన్నారు.

ఇది కూడా చదవండి..: Indiramma Towers | నిజామాబాద్​లో ఇందిరమ్మ టవర్స్​.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *