అక్షరటుడే, వెబ్డెస్క్: Tejas Fighter Jets | దేశీయంగా అభివృద్ధి చేసిన తేజస్ యుద్ధ విమానాలపై భారత వైమానిక దళ మాజీ వైస్ చీఫ్ నాగేష్ కపూర్ ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. 2030ల మధ్యకాలంలో ‘తేజస్ Mk-2’ యుద్ధ విమానాలు పెద్ద సంఖ్యలో సేవల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే అవి యుద్ధ రంగంలో ముందు వరుస (ఫ్రంట్‌లైన్) పాత్ర పోషించడానికి సరిపోవని తెలిపారు.
Tejas Fighter Jets | 6వ తరం విమానాల వైపు అడుగులు
చైనా ఇప్పటికే 6వ తరం విమానాల వైపు అడుగులు వేస్తుండగా.. 2035 నాటికి భారత్ వద్ద 4వ తరం విమానాలు ఉండటం సమంజసమేనా అని ప్రశ్నించగా.. ఆయన స్పందించారు. అమెరికాకు చెందిన F-22, చైనాకు చెందిన J-20 వంటి 5వ తరం యుద్ధ విమానాలు ‘స్టెల్త్’ (రాడార్‌కు చిక్కని) సామర్థ్యం, సెన్సార్ ఫ్యూజన్ మరియు ఆయుధాలను విమానం లోపలే అమర్చుకునే (internal carriage) సదుపాయాలను కలిగి ఉంటాయి. చైనాకు చెందిన J-36, J-50 వంటి 6వ తరం యుద్ధ విమానాలు ఆ స్టెల్త్ పునాదిపై మరిన్ని అధునాతన అంశాలను జోడిస్తాయి. ప్రస్తుతం భారత్ వద్ద 5వ లేదా 6వ తరం విమానాలు ఏవీ లేవు. 2030 నాటికి చైనా 500 వరకు 5వ తరం J-20 యుద్ధ విమానాలను మోహరించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. భారత్ తేజస్ Mk-2 తరగతికి చెందిన 4వ తరం యుద్ధ విమానాలు కూడా అత్యంత అధునాతనమైనవి కాకపోయినప్పటికీ, ఒక నిర్దిష్ట పాత్రను పోషించగలవని ఎయిర్ మార్షల్ అభిప్రాయపడ్డారు.
Tejas Fighter Jets | హెచ్ఏఎల్పై విమర్శలు
తేజస్ యుద్ధ విమానాలను తయారు చేసే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) వైఖరిని ఎయిర్ మార్షల్ తీవ్రంగా విమర్శించారు. తేజస్ Mk1A రకం విమానాలు ప్రస్తుతం తగినన్ని సంఖ్యలో అందుబాటులో లేకపోవడం “అత్యంత ఆందోళనకరమైన” విషయమని పేర్కొన్నారు. తేజస్ నమూనా మొదటిసారిగా 2001లో ఎగిరిందని ఆయన గుర్తు చేశార.ఉ ఆ తర్వాత భారత వైమానిక దళం విమానాల కోసం ఆర్డర్ ఇచ్చిందన్నారు. అయితే ఇప్పటికీ ఒక్క విమానం కూడా వైమానిక దళానికి అందలేదన్నారు.
ఇది కూడా చదవండి..: Maharashtra Family Tragedy | మొబైల్ గొడవ తెచ్చిన తీవ్ర విషాదం.. కొడుకును కాపాడబోయిన తల్లిదండ్రులు.. ముగ్గురి దుర్మరణం