అక్షరటుడే, వెబ్‌డెస్క్: Puja Ritual in Train | భారతీయ రైలు (Indian Train)లో ఒక మతపరమైన కార్యక్రమం జరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. “హనీమూన్ కోచ్” వీడియో వైరల్ అయిన కొద్దికాలానికే ఈ వీడియో బయటకు రావడంతో, రైలు బోగీలలో ఇలాంటి ఆచారాలను నిర్వహించడానికి అనుమతి ఉందా అని నెటిజన్లు ప్రశ్నించారు. దీనిపై తాజాగా రైల్వే శాఖ (Railway Department) అధికారులు క్లారిటీ ఇచ్చారు.
ఒక పూజారి రైలు బోగీలో నేలపై కూర్చుని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం వీడియోలో కనిపించింది. ప్రధానంగా తెల్లని దుస్తులు ధరించిన పలువురు భక్తులు కూడా ఈ పూజలో పాల్గొన్నారు. నార్తర్న్ రైల్వే తన అధికారిక ‘X’ ఖాతా ద్వారా దీనిపై వివరణ ఇచ్చింది. ఆ మతపరమైన కార్యక్రమం సాధారణ ప్రయాణికుల బోగీలో కాకుండా, ప్రైవేట్‌గా బుక్ చేసుకున్న ‘సెలూన్ కార్’లో జరిగిందని పేర్కొంది.
Puja Ritual in Train | విలాసంతమైన బోగీ
IRCTC ద్వారా ఒక ప్రైవేట్ పార్టీ బుక్ చేసుకున్న ప్రత్యేక సెలూన్ కార్‌లో ఈ పూజ జరిగిందని నార్తర్న్ రైల్వే తెలిపింది. సెలూన్ కార్ అనేది ఉన్నతాధికారులు, ప్రముఖుల (VIPs) కోసం ఉద్దేశించిన ఒక ప్రైవేట్, విలాసవంతమైన రైలు బోగీ. ఇందులో ఏసీ పడక గదులు, చిన్న వంటగది (కిచెన్), లివింగ్, డైనింగ్ రూమ్, అటాచ్డ్ వాష్‌రూమ్‌లు ఇతర సౌకర్యాలు ఉంటాయి. కమర్షియల్ బుకింగ్ కింద సంబంధిత వ్యక్తులు రూ. 3,08,580 అడ్వాన్స్ చెల్లించి ఈ బోగీని బుక్ చేసుకున్నారు. జూలై 10న న్యూఢిల్లీ నుంచి ముంబై (BDTS)కి జరిగే వన్-వే ప్రయాణం కోసం ఈ సెలూన్ కార్‌ను ‘పశ్చిమ్ ఎక్స్‌ప్రెస్’ (రైలు నం. 12926)కు జత చేశారు. ఆ సమయంలో బోగీలో పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ బోగీలో అలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చని రైల్వే శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి..: Citizenship Verdict | పౌరసత్వ హోదాపై సుప్రీంకోర్టు కీలక తీర్పు