Udhayanidhi Trisha Remarks | త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలు.. మహిళా కమిషన్​కు ఫిర్యాదు

ఉదయనిధి స్టాలిన్​ త్రిషపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీవీకే నాయకులు మహిళా కమిషన్​కు ఫిర్యాదు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Udhayanidhi Trisha Remarks | ఒక ర్యాలీలో నటి త్రిష (Actress Trisha)పై తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు వ్యతిరేకంగా టీవీకే పార్టీ జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఆయన వ్యాఖ్యలు ఆందోళనకరమైనవి, అభ్యంతరకరమైనవి అని పేర్కొంది.

తంజావూరులో కావేరీ వివాదంపై జరిగిన నిరసన సభలో సోమవారం ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌పై ఉదయనిధి విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల తమిళనాడుకు కావేరీ నీటిలో ఒక్క చుక్క కూడా రాలేదని ఆయన ఆరోపించారు. జనసమూహంలో కొందరు “త్రిష, త్రిష” అని నినాదాలు చేశారు. ఆ సమయంలో ఉదయనిధి స్టాలిన్​ తన ప్రసంగాన్ని ఆపి, అభ్యంతరకరమైన, ద్వంద్వార్థం వచ్చేలా స్పందించారు. ఈ వ్యాఖ్య తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపింది.”అత్యున్నత స్థాయి రాజకీయ వేదిక నుంచి ఇలాంటి భాషను ఉపయోగించడం వల్ల, బహిరంగ ప్రదేశాల్లో మహిళలను కేవలం ఒక వస్తువుగా చూడటం మరియు వారిని మాటలతో వేధించడం వంటివి సాధారణ విషయాలుగా మారిపోయే ప్రమాదం ఉంది,” అని ఆ ఫిర్యాదులో జోడించారు.

Udhayanidhi Trisha Remarks | రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

ఒక మహిళ పట్ల అసభ్యకరమైన, మహిళలను వస్తువుగా చూపేలా మాట్లాడినందుకు ఆ డీఎంకే నాయకుడు క్షమాపణ చెప్పాలని టీవీకే డిమాండ్ చేసింది. ఆయనపై పోలీసు కేసు నమోదు చేయాలని కోరింది. ఎవరిపైనైనా ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని టీవీకే ఎమ్మెల్యే రేవంత్​ చరణ్​ తెలిపారు. వారి కుటుంబం ఆలోచనా విధానాన్ని, రాజకీయ సంస్కృతిని ఇది బయట పెట్టిందన్నారు. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీవీకే యోచిస్తోంది.

ఇది కూడా చదవండి..: Supreme Court Footpath | ఆ నడక ప్రాథమిక హక్కు..ప్రతి రోడ్డుపై ఫుట్‌పాత్‌లను డీమార్క్ చేయాలి : సుప్రీంకోర్టు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *