అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ponnam Prabhakar | భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థలో నియంతృత్వానికి తావులేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చాలనే వారికి రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం చెంపపెట్టు లాంటిదన్నారు.
Ponnam Prabhakar | పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు
పొన్నం ప్రభాకర్ శనివారం మహబూబ్నగర్లో మాట్లాడారు. 44 ఏళ్లుగా బీజేపీకి మహిళా అధ్యక్షురాలు లేరన్నారు. కాంగ్రెస్ పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు కల్పించిందని చెప్పారు. డిలిమిటేషన్ ద్వారా దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగే విధంగా సీట్లు పెంచడంతో పాటు దానికి మహిళా బిల్లు జోడించడం అంటే వారికి చిత్తశుద్ధి లేదన్నారు. పార్టీ అధ్యక్షురాలు, ప్రధాని ,రాష్ట్రపతి, లోక్సభ స్పీకర్ను మహిళలను చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు.
Ponnam Prabhakar | కట్టుబడి ఉన్నాం
కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లకీ కట్టుబడి ఉందని పొన్నం తెలిపారు. మహిళా సాధికారతగా వెళ్తున్న తెలంగాణ మహిళలు బీజేపీ కుట్రలు తిప్పికొట్టాలని కోరారు. బీజేపీ ఎంపీ తెలంగాణ విభజనను భారత్ పాకిస్థాన్ విభజనతో పోల్చి అవమానపరిచే విధంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సభలో ఉన్న తెలంగాణ బీజేపీ ఎంపీలకు చీము నెత్తురు లేదా అని ప్రశ్నించారు. తేజస్వి మాటలు రికార్డుల నుంచి తొలగించకపోతే కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారన్నారు. తెలంగాణ కు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం అని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి..: Realme Narzo 100 Lite | బిగ్ బ్యాటరీతో రియల్‌మీ ఫోన్

